Begin typing your search above and press return to search.

కరోనా కిట్ +విస్కీబాటిల్ ఫ్రీ: ఎమ్మెల్సీ కిట్ లో ఆశ్చర్యం?

By:  Tupaki Desk   |   18 Jun 2021 3:59 AM GMT
కరోనా కిట్ +విస్కీబాటిల్ ఫ్రీ: ఎమ్మెల్సీ కిట్ లో ఆశ్చర్యం?
X
గెలిచేదాకా ఓటర్లను దేవుళ్లుగా చూస్తారు నేతలు. గెలిచాక ఐదేళ్ల దాకా పట్టించుకోరన్న విమర్శ ఉంది. ప్రజలు వెళ్లినా నువ్వు నాకు ఓటేశావా? అని కొందరు ప్రశ్నిస్తారు. అయితే తనను గెలిపించి ఎమ్మెల్సీని చేసిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లకు కరోనా వేళ జాగ్రత్తల కిట్ పంపాడు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ. ఎమ్మెల్సీ కిట్స్ పంపిణీ పై ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

ఆ మెడికల్ కిట్ లో శానిటైజర్, మాస్కులు, పల్స్ ఆక్సిమీటర్, డ్రైఫూట్స్ ఇతర జాగ్రత్తల వస్తువులు ఉన్నాయి. వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తనను గెలిపించి స్థానిక సంస్థల ప్రతినిధులకు తాజాగా మెడికల్ కిట్లు పంపిణీ చేశాడు. ఈ కరోనా కిట్ లో అన్నింటిని ఉంచాడు. వీటిని వరంగల్ జిల్లాల పరిధిలోని ఎమ్మెల్యేలు ఇటీవల నేతలకు పంపారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కూడా ఆ నియోజకవర్గ నాయకులకు వీటిని పంచాడు.

అయితే మహబూబాబాద్ లో తాజాగా కరోనా వస్తువులతోపాటు ఒక ‘టీచర్స్’ విస్కీ బాటిల్ కూడా పెట్టిన ఉన్న కరోనా కిట్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది కరోనా కిట్ లో ఎమ్మెల్సీ పెట్టాడా? లేక ఎవరైనా ఆకతాయిలు ఇలా చేశారా? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఈ మెడికల్ కిట్ లో పోచంపల్లి ఫొటోతో జాగ్రత్తలు, అభివృద్ధిపై పాంప్లెట్ ఉంది. అయితే తాజాగా కిట్ లో విస్కీ బాటిల్ ఉందన్న వార్త అయితే వైరల్ అయ్యింది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.