Begin typing your search above and press return to search.

కుటుంబం మొత్తానికి కరోనా అంటించాడు... బాధితుల్లో 9నెలల చిన్నారి!

By:  Tupaki Desk   |   28 March 2020 3:56 PM GMT
కుటుంబం మొత్తానికి కరోనా అంటించాడు... బాధితుల్లో 9నెలల చిన్నారి!
X
కరోనా వైరస్ భారత్ లో చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. క్వారంటైన్ లో కరోనా కి చికిత్స పొందుతున్న వారు..నిబంధనలు అతిక్రమించి బయటకు వచ్చి ఇతరులకు వైరస్ సోకే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఓ వ్యక్తి ఐదుగురికి వైరస్ సోకే విధంగా ప్రవర్తించాడు. అందులో 9 నెలల పాప ఉండడం అందరిని కలిచివేస్తోంది. ఈ ఘటన వెస్ట్ బెంగాల్ చోటు చేసుకుంది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన వారు సెల్ఫ్ క్వారంటైన్ పాటించకుండా వ్యాధిని మరింత వ్యాప్తి చెందిస్తున్నారు. ఇప్పటివరకు మనదేశంలో విదేశాల నుంచి వచ్చినవారికే ఎక్కువగా కరోనా పాజిటివ్ అని తేలుతోంది.

ఇటీవలే లండన్ నుంచి వచ్చిన యువకుడుని ప్రభుత్వం క్వారంటైన్‌ లో ఉండమని ఎంతగా చెప్పినప్పటికీ , బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించి , ఒక ఫంక్షన్‌ కు అటెండ్ అయ్యాడు. అతడికి కరోనా ఉండటంతో అతని ద్వారా ఓ మహిళకు కరోనా సోకింది. ఆమె ద్వారా కుటుంబ సభ్యులందరికీ అంటుకుంది. దీంతో మొత్తం కుటుంబంలో ఉన్న ఎనిమిది మందిని క్వారంటైన్‌ లో ఉంచారు. వారిలో ఐదుగురికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు నిర్ధారణ అయింది.

ఫంక్షన్ కి వెళ్లి వచ్చిన 27 ఏళ్ల మహిళకు కరోనా లక్షణాలు బయటపడ్డాయి. ఈమె నుంచి...9 నెలల చిన్నారి, 6 సంవత్సరాల కుమారుడికి, 45 ఏళ్ల మరో మహిళకు, ఆమె కుమారుడికి కూడా సోకింది. ఈ ఐదుగురిని ఇప్పుడు కోల్‌ కతాలోని ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ఫ్యామిలీతో సన్నిహితంగా మెలిగిన మరో 18 మందిని క్వారంటైన్‌ లో ఉంచారు. దీనికంతటికి కారణం ఆ యువకుడే అని తెలుసుకున్నారు. ప్రభుత్వం చూపినట్టు సెల్ఫ్ క్వారంటైన్ లో వున్నింటే ..ఇంతమందికి కరోనా సోకేదే కాదు. కాగా ,ఇప్పటివరకు పశ్చిమ బెంగాల్‌ లో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 15కు చేరింది.