Begin typing your search above and press return to search.

పబ్ ల ఓనర్స్ పారిపోయారా?

By:  Tupaki Desk   |   7 Aug 2020 3:00 PM GMT
పబ్ ల ఓనర్స్  పారిపోయారా?
X
అన్నింటికంటే ఖరీదైన లాభసాటి బిజినెస్ ఏదైనా ఉందంటే అది పబ్ ల బిజినెస్ అంటారు. ఎందుకంటే పబ్ లకు వచ్చే వారంతా యువత.. గొప్పింటి బిడ్డలే. చేతికి ఎముకే లేకుండా ఖర్చు పెడుతారు. దీంతో పబ్ ల వ్యాపారం హైదరాబాద్ లో మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లేది. చాలా మంది పబ్ లు ఏర్పాటు చేసి దందా నిర్వహిస్తూ లాభాల పంట పండించేవారు.

కానీ ఇప్పుడు కరోనా దెబ్బకు హైదరాబాద్ లోని పబ్ లు ఇప్పుడు పూర్తిగా మూతపడ్డాయి. పబ్ లు ఓపెన్ చేయాలి అంటే కనీసం దేశంలో ఒక సంవత్సరం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. పబ్ ల రెంట్ లైసెన్స్ ఫీజులు, మెయింటెనెన్స్ తడిచి మోపెడు అవుతుందని కాబట్టి అవి అన్ని చెల్లించలేక పబ్ నిర్వాహకులు ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకున్నారు. కొందరు పారిపోయారని టాక్.

దీంతో ఒకప్పుడు ఎంతో బాగా బతికినా పబ్ నిర్వాహకులంతా ఇప్పుడు అడ్రస్ కూడా లేకుండా హైదరాబాద్ లో పారిపోయారని వినికిడి. ఎవ్వరి ఫోన్లు పనిచేయడం లేదట.. కనీసం అద్దెలు కూడా చెల్లించే స్థోమత లేకపోవడంతో అలాగే పబ్ లను వదిలేశారట.. మరి కరోనా తగ్గాక మామూలు పరిస్థితులు వస్తే మళ్లీ పబ్ లు తెరుస్తారా? లేదా ఈ కరోనా దెబ్బకు పూర్తిగానే ఆ వ్యాపారానికి స్వస్తి పలుకుతారా అన్నది వేచిచూడాలి. ఇప్పుడు పబ్ ల బిల్డింగ్స్ అన్నీ ఖాళీగా దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.