వివాదాస్పద వ్యాఖ్యల ఫలితం.. కేరళ మంత్రి రాజీనామా!

Thu Jul 07 2022 06:00:01 GMT+0530 (India Standard Time)

Controversial comments result Kerala minister resigns

మాట పెదవి దాటితే పృథ్వీ దాటుతుందని ఓ సామెత. ఇలాగే ఓ మంత్రి నోటికొచ్చిందల్లా మాట్లాడి తన మంత్రి పదవిని పోగొట్టుకున్నారు. భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని రచించిన అంబేడ్కర్ ను అవమానించారని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కేరళ మత్స్య శాఖ మంత్రి సాజీ చెరియన్ తన పదవికి రాజీనామా చేశారు.భారత రాజ్యాంగాన్ని అవమానించారంటూ ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రతిపక్షాలు కాంగ్రెస్ బీజేపీ ఆయనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో రాజకీయ ఒత్తిళ్లను తట్టుకోలేని సాచీ చెరియన్ బుధవారం సాయంత్రం తన కేబినెట్ మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

ఓ రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్న సాచీ చెరియన్ దేశ రాజ్యాంగంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కార్మికులు నిరసన వ్యక్తం చేసేందుకు దేశం అనుమతించదని కానీ వారిపై దోపిడీ చేసే వారిని మాత్రం ప్రోత్సహిస్తోందని ఆయన విమర్శించారు.

ఈ కారణంతోనే దేశంలో కార్పొరేట్ రంగం పెరిగిపోతూ మిలీనియర్ల సంఖ్య పెరిగిపోతోందని ఆరోపించారు. బ్రిటీష్ వారు సంకలనం చేసిన రాజ్యాంగాన్ని ఓ భారతీయుడు రాశారని దానినే 75 ఏళ్లుగా అమలు చేస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

చెరియన్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్ బీజేపీ మంగళవారం తీవ్ర అభ్యంతరం తెలిపాయి. ఆయన్ను వెంటనే కేబినెట్ నుంచి తొలగించి కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. రాజ్యాంగాన్ని రాజ్యాంగ రూపకర్తలను చెరియన్ అవమానించారంటూ కేరళ అసెంబ్లీలో ప్రతిపక్షాలు నినాదాలతో హోరెత్తించాయి.

క్రమంలో చర్చ జరగకుండానే స్పీకర్ ఎంబి రాజేష్ సభను వాయిదా వేశారు. ఈ చర్యపై నిరసన వ్యక్తం చేస్తూ.. స్పీకర్ కార్యాలయంలో విపక్షాలు నిరసన చేపట్టాయి. ఆయనపై చర్యలు తీసుకోకుంటే కోర్టుకు వెళతామని హెచ్చరించాయి. బీజేపీ లేఖ రాయడం చివరకు సొంత పార్టీ నేతల ఒత్తిళ్ల మేరకు సాచీ చెరియన్ జీనామా చేశారు.