Begin typing your search above and press return to search.

పాక్ మాజీ ప్రధాని హత్యకు సుపారీ..!

By:  Tupaki Desk   |   29 Jan 2023 5:00 AM GMT
పాక్ మాజీ ప్రధాని హత్యకు సుపారీ..!
X
పాకిస్తాన్ లో రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతాయో ఎవరికీ అర్థం కాదు. అక్కడి రాజకీయాలను పాకిస్థాన్ ఆర్మీ లేదంటే ఉగ్రవాద సంస్థలు కంట్రోల్ చేయడం కామన్ గా మారింది. ఆ దేశానికి భారతదేశంతోపాటే స్వాతంత్య్రం వచ్చినప్పటికీ ఇప్పటి వరకు అక్కడ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం నేటికీ ఐదేళ్లు పాలన పూర్తి చేసుకోకపోవడం గమనార్హం.

పాకిస్తాన్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన పాలన మాత్రం ఆర్మీనో లేదంటే ఉగ్రవాదులో చేస్తుంటారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడి రాజకీయాలు ఎల్లప్పుడు అనిశ్చితిలో సాగుతుంటాయి. ఆర్మీకి.. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే వారి ప్రభుత్వం వెంటనే కూలిపోవడం ఖాయం అనడానికి ఎన్నో ఉదాహరణలున్నాయి.

కాగా పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గతంలో ఓసారి ఆత్మాహుతి దాడి చేసింది. అయితే ఆ దాడి నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఈ క్రమంలోనే గత సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ మెజార్టీ స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చింది. అయితే పాక్ లో ఆర్థిక మాంద్యం.. ఇతర కారణాల రీత్యా ఇమ్రాన్ ఖాన్ తన పదవీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

ఈ క్రమంలోనే ఆయన పాక్ ఆర్మీ.. ఉగ్రవాద సంస్థలపై సంచలన ఆరోపణలు చేశారు. అయితే తాజాగా తన హత్యకు కుట్ర మరోసారి కుట్ర జరిగిందని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించడం సంచలనంగా మారింది. తన హత్యకు కోసం ఓ ఉగ్రవాద సంస్థకు మాజీ అధ్యక్షుడు జర్దారీ భారీగా నిధులు ఇచ్చారని ఆయన ఆరోపించారు.

సింధ్ ప్రభుత్వం నుంచి అక్రమంగా సంపాదించిన సొమ్మును జర్దారీ తన హత్యకు సుపారీగా ఇచ్చారని మీడియాకు వెల్లడించారు. గతంలోనూ ఇదే తరహాలో తన హత్యకు ఆయన కుట్ర పన్నారని.. ఇందులోనూ జర్దారీ పాత్ర ఉందన్నారు. వజీరాబాద్‌లో తనపై ‘ప్లాన్-బి’ అమలు చేసి అంతమొందించాలని చూశారన్నారు. అయితే అదృష్టవశాత్తు గాయాలతో బయట పడ్డానని గుర్తు చేశారు.

ప్లాన్-బి విఫలం కావడంతో ఇప్పుడు ప్లాన్-సిని అమలు చేస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఓ ఉగ్ర సంస్థకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చినట్లు తన వద్ద సమాచారం ఉందన్నారు. ఈ కుట్రలో ప్రభుత్వ ఏజెన్సీల పాత్ర సైతం ఉందని ఆయన ఆరోపించారు. కాగా గతేడాది నవంబరు 3న ఇమ్రాన్‌ ఖాన్ పై జరిగిన దాడిలో ఆయన కుడికాలికి బుల్లెట్ గాయమైంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.