Begin typing your search above and press return to search.

తూచ్ అనేసిన కాంగ్రెస్ పెద్దాయన ….గాంధీల దయ లేదా...?

By:  Tupaki Desk   |   23 Sep 2022 10:25 AM GMT
తూచ్ అనేసిన కాంగ్రెస్ పెద్దాయన ….గాంధీల దయ లేదా...?
X
కాంగ్రెస్ పార్టీలో అంతా నామినేటెడ్ కల్చర్ ఉంది. అలాగే అది ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే ఇపుడు ఆశ్చర్యకరంగా ఎన్నికలకు తెర లేపారు. అది కూడా గాంధీ ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా ఆ పార్టీలోని ఎవరైనా ప్రెసిడెంట్ కావచ్చు అంటూ ఆశలే రేపారు. దాంతో కాంగ్రెస్ లో పెద్దాయనగా పేరున్న దిగ్విజయ్ సింగ్ తానూ రెడీ అన్నారు. రేసులో ఉన్నాను అని చెప్పుకున్నారు.

అయితే అంతా అయ్యాక అధ్యక్ష ఎన్నికలకు ముహూర్తం కూడా రెడీ అయ్యాక సడెన్ గా తూచ్ అనేశారు. తాను రేసులో లేనని చెప్పి మీడియాకు షాక్ ఇచ్చారు. నిజానికి దిగ్విజయ్ సింగ్ తాను పోటీ చేస్తున్నట్లుగా ఈ మధ్యనే సంకేతాలు ఇచ్చారు. సీనియర్ నేత కాబట్టి ఆశలు ఉన్నాయని, అవకాశాలు కూడా ఉన్నాయని అంతా భావించారు.

అయితే కాంగ్రెస్ మనసు ఎరిగిన పెద్దాయన చాలా స్మూత్ గా తప్పుకున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ లో అధ్యక్ష ఎన్నికలు అంటూ జరుగుతున్నా అది అంతా మొక్కుబడి తంతుగానే ఉంది అని అంటున్నారు. ఎందుకంటే సోనియాగాంధీ, రాహుల్ గాంధీ మదిలో ప్రెసిడెంట్ ఎవరొ ఎపుడో డిసైడ్ అయిపోయారు.

రాజస్థాన్ ముఖ్యమంత్రి, సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ కి చాన్స్ ఇచ్చి కాంగ్రెస్ పెద్దగా చూడాలన్నది గాంధీ ఫ్యామిలీ డెసిషన్. ఇక రాజస్థాన్ లో ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్న సచిన్ పైలెట్ కి ఆ విధంగా లైన్ క్లియర్ చేయలన్నది కూడా మరో వ్యూహం. రాజస్థాన్ లో యువ నేత సచిన్ తో అశోక్ కి గ్యాప్ ఉంది. ఇద్దరు వర్గాలు వేరుగా ఉన్నాయి.

దాంతో సచిన్ సీఎం పదవి కోసం పట్టుబడుతూ ఒక దశలో బీజేపీ వైపు కూడా చూడాలనుకుంటున్నట్లుగా వార్తలు వచ్చాయి. దాంతో ఇపుడు బలమున్న రాజస్థాన్ని కాపాడుకోవాలన్నది ఒక ఎత్తుగడ. అందుకే ఒక నాయకుడికి ఒకే పదవి అన్న నిబంధలన మేరకు గెహ్లాట్ ని అధ్యక్ష పీఠం మీద పెట్టి మిగతా కధ గాంధీలు నడుపుతారు అని తెలుస్తోంది.

మరి ఇంత వ్యూహం గాంధీల వద్ద ఉంటే అధ్యక్ష ఎన్నిక అంటూ మే ము సైతమని డీ అని మిగిలిన నాయకులు పోలోమంటూ రెడీ కావడమే చిత్రం. ఎట్టకేలకు అతి ఉత్సాహాన్ని తగ్గించినుకుని దిగ్విజన్ కాంగ్రెస్ పెద్దల మనసెరిగి వ్యవహరించారు అని అంటున్నారు. ఇక అధ్యక్ష రేసులో గెహ్లాట్ కేంద్ర మాజీ మంత్రి శశి ధరూర్ ఇద్దరే మిగిలారు. చిత్రమేంటి అంటే శశిధరూర్ సోనియాను కలసి ఆమె అనుమతితో బరిలో ఉంటున్నారు.

మరి అధ్యక్ష ఎన్నికలు అంటే ఏ పోటీ లేకుండా నామినేట్ చేయడం బాగుండదు కదా అలా పోటీకి పనికివచ్చే వారిగా శశిధరూర్ సీన్ లో ఉంటారని అంటున్నారు. ఏది ఏమైనా తన పేరులోనే దిగ్విజయాన్ని పెట్టుకున్న పెద్దాయన మాత్రం ముందే రేసు నుంచి అవుట్ కావడం చిత్రమే. అయితే కాంగ్రెస్ లో ఇలాంటివి షరా మామూలుగానే సాగుతుంటాయి కాబట్టి ఆయనకూ నో ప్రాబ్లెం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.