Begin typing your search above and press return to search.

న్యూ ఫేస్ కావాలి : సోనియా...రాహుల్ సమక్షలోనే ఆమె పేరు...?

By:  Tupaki Desk   |   15 May 2022 11:30 AM GMT
న్యూ ఫేస్ కావాలి : సోనియా...రాహుల్ సమక్షలోనే ఆమె పేరు...?
X
కాంగ్రెస్ అంటేనే గాంధీల ఆస్తి. ఈ విషయంలో ఎవరికీ రెండవ అభిప్రాయానికి అసలు తావు లేదు. ఇక ఇందిర నుంచి రాజీవ్ అక్కడ నుంచి సోనియా ఇలా కాంగ్రెస్ పగ్గాలు మారుతూ వచ్చాయి. తన నుంచి కుమారుడి రాహుల్ కి కాంగ్రెస్ పెత్తనం అప్పచెప్పాలని సోనియా ఆరాటం. దానికి తగినట్లుగా 2108లో కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా రాహుల్ ని చేశారు. కానీ 2019లో ఓటమి తరువాత రాహుల్ ఆ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం టెంపరరీ ప్రెసిడెంట్ గా సోనియా ఉన్నారు.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ ని ఎలా గాడిలో పెట్టాలి అన్న దాని మీద రాజస్థాన్ ఉదయపూర్ లో చింతన్ శిబిర్ పేరిట కాంగ్రెస్ పార్టీ తాజాగా మేధమధనం జరుపుతోంది. ఈ మధనంలో అనేక రకాలైన ఆలోచనలు కాంగ్రెస్ నేతల నుంచి వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసింది. అలాంటి పార్టీని ఆదుకోవడానికి నాయకులు ముందుకు రావాలని సోనియా గాంధీ కోరారు.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ నాయకత్వం పటిష్టంగా ఉండాలని చాలా మంది నాయకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా రాహుల్ బదులు ప్రియాంకా గాంధీని చేయాలని కూడా ఈ చింతన్ శిబిర్ లో పలువురు నాయకులు డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ కి చెందిన ప్రమోద్ క్రిష్ణ అనే సీనియర్ నాయకుడు ప్రియాంక ప్రెసిడెంట్ అయితే కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుంది అని స్పష్టం చేశారు.

ఆయన మాదిరిగానే పలువురు నేతలు ప్రియాంకనే లీడర్ అని పేర్కొనడం విశేషం. ఇక్కడ విషయం ఏంటి అంటే సోనియాకు రాహుల్ నే ప్రెసిడెంట్ గా చూడాలని ఉంది. రాహుల్ విషయానికి వస్తే ఆయన పాలిటిక్స్ ని అంత సీరియస్ గా తీసుకొవడంలేదు అన్న బాధ నాయకులలో ఉంది.

దాంతో ప్రియాంకా గాంధీయే ఆశాకిరణంగా వారికి కనిపిస్తున్నారు. మరి సోనియా గాంధీ దీనికి అంగీకరిస్తారా. రాహుల్ ఏమంటారో కూడా తెలియదు కానీ చింతన్ శిబిర్ లో కాంగ్రెస్ అధికారంలోకి ఎలా తేవాలన్నది అంతా కిందా మీద పడుతున్న వేళ ప్రియాంకా గాంధీ టాక్ ఆఫ్ ది పార్టీ కావడం అంటే ఇందిరమ్మ మనవరాలే ఖద్దరు పార్టీకి సరైన నాయకురాలు అని అంతా చెబుతున్నట్లే అంటున్నారు.