Begin typing your search above and press return to search.

సైకిల్ తొక్కిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా

By:  Tupaki Desk   |   26 Nov 2020 4:15 AM GMT
సైకిల్ తొక్కిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా
X
ఊపిరి సలపని బిజీ షెడ్యూల్ లో ఉండే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గడిచిన కొన్నేళ్లుగా ఆరోగ్యం ఏ మాత్రం బాగా లేదన్నది తెలిసిందే. తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో ఆమె ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల కాలంలో దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో.. వైద్యుల సలహాలు.. సూచనలతో ఆమె గోవాకు వెళ్లారు.

ఆ టూరిస్టు నగరంలో లీలా ప్యాలెస్ హోటల్ లో ఆమె ఉంటున్నారు. ఆరోగ్య పరిస్థితుల కారణంగా మరికొద్ది రోజులు ఆమె ఢిల్లీకి బదులుగా.. గోవాలో ఉండనున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఆమె తన ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ చూపుతున్నట్లుగా చెబుతున్నారు. విశాలమైన హోటల్ ఆవరణలో జాగింగ్ తో పాటు సైక్లింగ్ కూడా చేస్తున్నారు.

తాజాగా ఆమె సైక్లింగ్ తొక్కుతున్న చిట్టి వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతమైన వైరల్ గా మారింది. బాడీ గార్డులు వెంట వస్తున్న వేళ.. ఆమె సైకిల్ తొక్కారు. దీంతో ఆమెను గుర్తు పెట్టిన పలువురు స్థానికులు ఫోటోలు.. వీడియోలు తీసుకున్నారు. గోవాలో సోనియాగాంధీ సైకిల్ తొక్కుతున్న వైనం ఇప్పుడు అందరిని ఆకర్షించటమే కాదు.. వైరల్ గా మారింది. చూస్తుంటే.. కాంగ్రెస్ అధినేత్రి తన ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా చెప్పక తప్పదు.