Begin typing your search above and press return to search.

ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కాంగ్రెస్

By:  Tupaki Desk   |   23 Nov 2021 11:30 AM GMT
ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కాంగ్రెస్
X
తెలంగాణలో స్థానిక, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలోనే నేడు నామినేషన్లకు చివరి రోజు. ఇప్పటికే టీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించింది.

కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయాలా? వద్దా? అని సమాలోచనలు చేస్తోంది. ఇప్పటికే దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయాలా? వద్దా? అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్య నేతలతో సమావేశమయ్యారు.

ఈ మేరకు 12 స్థానాల్లో బలం అధికంగా ఉన్న స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను దింపడానికి రెడీ అయ్యారు.

ఖమ్మం నుంచి ఎమ్మెల్సీ స్థానానికి రాయల్ నాగేశ్వరరావుకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీఫాం ఇవ్వడం విశేషం. అంతేకాకుండా మెదక్ లో నిర్మలా జగ్గారెడ్డికి కాంగ్రెస్ బీఫామ్ దక్కింది.

అయితే నల్గొండలో మాత్రం కాంగ్రెస్ అయోమయంలో ఉంది. ఎందుకంటే.. ఎంపీ కోమటిరెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ ల మధ్య ఇంకా సయోధ్య కుదరకపోవడంతో ఆ స్థానంపై ఇంకా స్పష్టత రాలేదు. మరి ఏం జరుగుతుందనేది వేచిచూడాలి.