అక్కడ ఎన్నికల్లో పోటీ చేయనంటున్న కాంగ్రెస్!

Wed Oct 09 2019 18:50:08 GMT+0530 (IST)

Congress decides to boycott BDC elections in Jammu and Kashmir

భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండవసారి ప్రధానమంత్రి అయ్యాక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ దేశ ప్రజల దృష్టిలో హీరోగా నిలిచిపోయారు. కొన్ని నెలల క్రింద జమ్మూ కాశ్మీర్ లో 370 రద్దు చేసి పాకిస్థాన్ కి చెమటలు పట్టించారు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ కూడా ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల్లాగే దేశంలో అంతర్భాగం. అయితే 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్ లో అల్లర్లు జరుగుతాయేమో అని కొంతమంది నేతలను గృహ నిర్బంధంలో ఉంచారు. ఇప్పుడు ఆ రాష్ట్రంలో తొలిసారిగా అక్టోబర్ 24న బీడీసీ ఎన్నికలు జరగబోతున్నాయి.అయితే ఈ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. బ్లాక్ డెవెలప్ మెంట్ కౌన్సిల్ (బీడీసీ) ఎలెక్షన్స్ ను బాయికాట్ చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తమ పార్టీకి చెందిన ప్రధాన నేతలను మోడీ గృహ నిర్బంధంలో ఉండగా ఇంకెవరు పోటీచేస్తారని - కార్యకర్తలకు ఎవరు దైర్యం చెప్తారని జమ్మూకాశ్మీర్ కాంగ్రెస్ చీఫ్ గులాం అహ్మద్ మీర్ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఎలెక్షన్ తేదీలు ప్రకటించే ముందు ఎలెక్షన్ కమిషన్ రాజకీయ పార్టీలతో సంప్రదించి ఉంటే బాగుండేదని ఆయన అన్నారు. అధికారం ఒక పార్టీకి ఇవ్వడానికి కుట్ర జరుగుతుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.