Begin typing your search above and press return to search.

ఆ ఇద్దరు నాయకులు ఉన్నంత వరకు కాంగ్రెస్ బతికి బట్టకట్టదా?

By:  Tupaki Desk   |   14 July 2020 3:30 PM GMT
ఆ ఇద్దరు నాయకులు ఉన్నంత వరకు కాంగ్రెస్ బతికి బట్టకట్టదా?
X
ఒకప్పుడు భారత్ లో ఒకటి రెండు తప్ప అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉండేది. ఇందిరాగాంధీ టైంలో దేశం అంతా ఆమె ఏం చెబితే అది విన్నారని.. రాను రాను ప్రజలందరూ మెల్లి మెల్లిగా కాంగ్రెస్ డిక్టేటర్స్ షిప్ ఒప్పుకోవడం లేదు కాబట్టి కాంగ్రెస్ ఈరోజు ఒక ప్రాంతీయ పార్టీ మాదిరి తయారైందని మేధావులు అంటున్నారు.

సోనియా గాంధీ నాయకత్వంలో ఈ దేశంలో ఉన్న మనస్తత్వాలు ఆమెకు తెలియజేయకుండా కొందరు అడ్డుపడుతున్నారట.. ఇందిరాగాంధీలా ఇలా ఉండాలి.. అలా ఉండాలని రోజు అహ్మద్ పటేల్, చిదంబరంలు సోనియా గాంధీకి నూరిపోస్తున్నారంట.. వాళ్లు ఇద్దరు ఉన్నంత వరకు కాంగ్రెస్ బతికి బట్టకట్టదు అని కాంగ్రెస్ వర్గాలే అంటున్నాయి. వాళ్లిద్దరికీ క్షేత్రస్థాయిలో ఏమీ జరుగుతుందో తెలియడం లేదు. ప్రజల్లో తిరుగరు. రాష్ట్రాల్లో ఎవరైనా యాక్టివ్ గా ఉంటే వాళ్లను తొక్కేస్తారు. వాళ్ల ఇద్దరిపై ఎన్నో కోట్ల అవినీతి కేసుల్లో విచారణ జరుగుతోంది. ఇలాంటి వాళ్ల వల్ల కాంగ్రెస్ బతికి బట్టకట్టే పరిస్థితి లేదంటున్నారు.

ఉదాహరణకు.. ప్రణబ్ ముఖర్జీ ఎన్నో సార్లు సోనియాగాంధీకి చెప్పినా ఆమె మాత్రం చెవినెక్కించుకోకుండా వీళ్లిద్దరి మాటలే వింటుందని అంటున్నారు. ప్రణబ్ ముఖర్జీ వైఎస్ఆర్ చనిపోయిన సమయంలో ఏపీలో జగన్ ను వదలుకోవద్దు అని.. ముఖ్యంగా ఏపీలో తెలుగు రాష్ట్రాల్లో సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుందని చెప్పినా కూడా ఆమె అప్పట్లో వినలేదట.. జగన్ బయటకు వెళ్లి సక్సెస్ అయ్యాడు.

పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ, మధ్యప్రదేశ్ లో సింధియా నుంచి ఇప్పుడు రాజస్థాన్ లో పైలట్ వరకు అందరూ యువకులు వాళ్లకు వాక్చాతుర్యం టాలెంట్ ఉంది. ఇలాంటప్పుడు వాళ్లను ఎంకరేజ్ చేయకుండా ముసలి జంభూకాలకే ప్రాధాన్యం ఇవ్వడంపై ఆ పార్టీలో ఉన్న యువ నాయకులే తెగ తిడుతున్నారంట..

ఇలానే అందరూ పోతుంటే.. కాంగ్రెస్ లో యువ నాయకత్వం బతుకుతుందా? ముసలి జంబూకాలతో చచ్చిపోతుందా అని వేచిచూద్దాం అని కాంగ్రెస్ వర్గాలే నిట్టూరుస్తున్న పరిస్థితి ఆ పార్టీలో కనిపిస్తోంది.