Begin typing your search above and press return to search.

రేవంత్ తో డైరెక్ట్ ఫైట్ కు రెడీ అయిన జగ్గారెడ్డి

By:  Tupaki Desk   |   14 Aug 2022 3:59 PM GMT
రేవంత్ తో డైరెక్ట్ ఫైట్ కు రెడీ అయిన జగ్గారెడ్డి
X
కాంగ్రెస్ లో స్వేచ్ఛ ఎక్కువ. ఎవరు ఏమన్నా పట్టించుకోరు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఆ పదవి ఇచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ సీనియర్లు అసమ్మతి రాజేస్తూనే ఉన్నారు. తాజాగా జగ్గారెడ్డి కూడా రెచ్చిపోయారు. కొద్దిరోజులుగా హైదరాబాద్ కేంద్రంగా రేవంత్ రెడ్డిపై సొంత పార్టీలోని వ్యతిరేకులు స్వరం పెంచారు. వరుసగా సమావేశాలు, అల్టిమేటం జారీ చేస్తున్నారు. కాంగ్రెస్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లాంటి నేతలు పార్టీ హైకమాండ్ కు తాము విధేయులమని చెబుతూనే.. రేవంత్ తో ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగిస్తున్నారు. ఇక ఇప్పుడు రేవంత్ -అసమ్మతి నేతల ఫైట్ ఢిల్లీకి చేరింది.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఇప్పటికే ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేశాడు జగ్గారెడ్డి.. రేవంత్ పైన ఫిర్యాదు చేయడానికి.. రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు వివరించడానికి కాంగ్రెస్ అసమ్మతి నేతలు ఢిల్లీకి చేరారు. వారికి ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ, అగ్ర నేత రాహుల్ గాంధీ యే కాదు.. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర ఇన్ చార్జి మాణిక్కం ఠాగూర్ కూడా అపాయింట్ మెంట్ ఇవ్వడానికి నిరాకరించారు. అయినా పట్టువీడకుండా రేవంత్ పై అసమ్మతిని రాజేస్తూనే ఉన్నాడు.

రేవంత్ కు వ్యతిరేకంగా మరో ఇద్దరు ఎంపీలు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా జగ్గారెడ్డి వెనుకుండి నడిపిస్తున్నారని అంటున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాక అసమ్మతిపై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహంగా ఉంది. వారిపై కఠినంగా వ్యవహారించాలనే అభిప్రాయంతో ఉంది. ఎక్కడా ఎవరిని ప్రోత్సహించకూడదని నిర్ణయించింది.

అయినా కూడా జగ్గారెడ్డి మాత్రం తగ్గేదేలే అంటూ ముందుకెళుతున్నాడు. ఎవరు పిలిచినా పిలవకున్నా మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వెళతానని జగ్గారెడ్డి తొడగొట్టారు. మునుగోడులో కాంగ్రెస్ ను గెలిపించడానికి ఓ వైపు రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు వెళుతుంటే మరోవైపు జగ్గారెడ్డి మాత్రం సొంత పార్టీలోనే మరో వర్గంగా అసమ్మతి రాజేయడం అక్కడ ఓటమికి దారితీస్తుందన్న భయాలు కాంగ్రెస్ శ్రేణులను వెంటాడుతున్నాయి. అయినా జగ్గారెడ్డి మాత్రం వెనక్కితగ్గడం లేదు.

తాజాగా జగ్గారెడ్డి హాట్ కామెంట్స్ చేశాడు. ‘పార్టీ గెలుపునకు నా వంతు కృషి చేస్తాను.. వెంకట్ రెడ్డిని అధిష్టానం పిలిచి బుజ్జగిస్తే పార్టీ కోసం పనిచేస్తామని.. పార్టీలో మేమంతా సైనికులం అని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. అధిష్టానమే మాకు బాస్ అని.. దుబ్బాకలో ఈసారి బీజేపీ గెలవదని స్పష్టం చేశారు. హుజూరాబాద్ లో ఓడిపోతానన్న భయంతోనే ఈటల గజ్వేల్ నుంచి పోటీచేస్తాంటున్నాడని జగ్గారెడ్డి అన్నారు.

సొంత పార్టీలోనే ఉంటూనే కాంగ్రెస్ ఓటమికి జగ్గారెడ్డి అసమ్మతి రాజేస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో అధిష్టానం కఠిన చర్యలు తీసుకోకపోతే మరింత మంది రెచ్చిపోతారని అంటున్నారు.