Begin typing your search above and press return to search.

భారత్-న్యూజిలాండ్ రెండో టెస్టుపై గందరగోళం

By:  Tupaki Desk   |   28 Nov 2021 8:30 AM GMT
భారత్-న్యూజిలాండ్ రెండో టెస్టుపై గందరగోళం
X
దక్షిణాఫ్రికాలో పుట్టుకొచ్చిన ప్రాణాంతక కరోనా వైరస్ రకం ఇప్పుడు అందరినీ భయపెడుతోంది. కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ ధాటికి ఇప్పుడు ప్రపంచమే గడగడలాడుతోంది. తీవ్ర భయాందోళనల్లో నెట్టేసింది. ఇది వరకూ వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారికి సంబంధించిన డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్ల కంటే దీన్ని అత్యంత ప్రమాదకరమైనదిగా ప్రపంచ ఆరోగ్యసంస్థ నిర్ధారించింది. దీంతో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి.

ఫలితంగా దక్షిణాఫ్రికా సహా ఇతర ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే వారిపై అన్ని దేశాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. వారిని క్వారంటైన్ చేస్తున్నాయి. ఈ దిశగా సరికొత్త ప్రొటోకాల్స్ ను విడుదల చేశాయి.

ఇక భారతదేశం కూడా ఒమిక్రాన్ వేరియంట్ పై హైఅలెర్ట్ ప్రకటించింది. ప్రధాని నరేంద్రమోడీ శనివారం దేశ రాజధానిలో అత్యున్నత సమావేశాన్ని నిర్వహించారు. వైద్య,ఆరోగ్యమంత్రిత్వశాఖ, కేంద్ర కేబినెట్ కార్యదర్శితో భేటి అయ్యారు.ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ దేశంలో విస్తరించకుండా అవసరమైన అన్ని చర్యలను యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాలని ఆదేశించారు.

ఈ క్రమంలోనే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒమిక్రాన్ వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని.. వైరస్ ప్రభావిత దేశాల నుంచి వచ్చే వారిని క్వారంటైన్ చేయాలని కేంద్రం సూచించింది. దీంతో రాష్ట్రాలు కొత్త కోవిడ్ ప్రొటోకాల్స్ ను రూపొందించాయి. వాటిని తక్షణమే అమల్లోకి తీసుకొచ్చాయి.

ఆఫ్రికన్ దేశాల నుంచి విస్తరిస్తున్న ఈ వైరస్ ను అడ్డుకునేందుకు ఆ దేశాల నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులను క్వారంటైన్ చేయాలని లేదంటే తక్షణమే సరిహద్దులు మూసివేయాలని డిసైడ్ అయ్యారు. రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే వారిపై ఆంక్షలను విధించారు. కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ ను ఇవ్వాలని సూచిస్తున్నాయి. ప్రధానంగా ముంబైకి రాకపోకలు సాగించే ఆఫ్రికన్ దేశాల వారి సంఖ్య అధికంగా ఉండడంతో మహారాష్ట్ర ప్రభుత్వం తక్షణ నివారణ చర్యలు చేపట్టింది. క్వారంటైన్ తోపాటు పరీక్షలు చేశాక నెగెటివ్ వస్తేనే వారిని ఇళ్లకు పంపాలని నిర్ణయించింది.

ఇక ముంబై క్రికెట్ అసోసియేషన్ కు కూడా ఇవే ఆదేశాలు జారీ చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. దీంతో ఈ నిబంధనల ఎఫెక్ట్ ముంబైలో జరిగే భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఆరంభమయ్యే రెండో టెస్ట్ పై పడింది. డిసెంబర్ 3 నుంచి వాంఖడేలో రెండో టెస్ట్ ఆరంభం కానుంది. 100శాతం ప్రేక్షకులకు అనుమతి ఉండేది.. దాన్ని ఇప్పుడు తగ్గించింది మహారాష్ట్ర ప్రభుత్వం. 23శాతానికి తగ్గించింది.