Begin typing your search above and press return to search.

బీహార్ లో మళ్లీ సంపూర్ణ లాక్ డౌన్.. ఎప్పటివరకంటే

By:  Tupaki Desk   |   4 May 2021 7:15 AM GMT
బీహార్ లో మళ్లీ సంపూర్ణ లాక్ డౌన్.. ఎప్పటివరకంటే
X
గత కొన్ని రోజులుగా ఇండియా లో కరోనా వైరస్ మహమ్మారి కేసులు రోజు రోజుకు ఎక్కువ సంఖ్యలో నమోదు అవుతున్నాయి. రోజుకు మూడున్నర లక్షలకు పైగా కేసులు నమోదవుతున్న తరుణంలో కేసులను కంట్రోల్ చేయకుంటే దేశ ఆరోగ్యవ్యవస్థ కుప్పకూలే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రాల్లోని కోర్టులు కరోనా మహమ్మారి విషయంలో జోక్యం చేసుకుంటున్నాయి. కరోనా మహమ్మారిని కంట్రోల్ చేయడానికి తీసుకుంటున్న చర్యలను వివరించాలని ఆదేశాలు జారీ చేస్తున్నాయి. కేంద్రం కూడా రాష్ట్రానికే కరోనా భాద్యతలు విడిచిపెట్టడంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు పరిస్థితి చేయి దాటకముందే కరోనా ను కట్టడి చేయాలనే లక్ష్యం తో లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. మహారాష్ట్ర , కర్ణాటక , ఢిల్లీ లో లాక్ డౌన్ కొనసాగుతుంది .

తాజాగా, బీహార్ హైకోర్టు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. బీహార్ లో రోజువారీ కేసులు పెరుగుతుండటంతో పాటుగా, హైకోర్టు కూడా కీలక ఆదేశాలు జారీ చేయడంతో ఈరోజు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి పాజిటివ్ కేసుల నమోదు పెరిగిపోతుండటంతో , దాన్ని ఆపాలంటే లాక్ డౌన్ ఒక్కటే మార్గమని భావించి మే 15 వ తేదీ వరకు రాష్ట్రంలో సంపూర్ణ లాక్ డౌన్ విధించారు సీఎం నితీష్ కుమార్. దీనితో దేశంలో లాక్ డౌన్ విధించిన రాష్ట్రాల జాబితాలోకి బీహార్ కూడా చేరింది. లాక్ డౌన్ కి సంబందించిన గైడ్ లైన్స్ ను త్వరలోనే విడుదల చేయనున్నారు.