బరువు తగ్గితే పది లక్షలు.. ఉద్యోగులకు ఆ కంపెనీ బంఫర్ ఆఫర్!

Mon Sep 26 2022 18:00:01 GMT+0530 (India Standard Time)

Company Offer to Employees on Reducing Weight

ఇది నిజంగా ఉద్యోగులకు బంఫర్ ఆఫరే. అయితే అందరికీ కాదండోయ్.. కేవలం జెరోడా కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు ఆ కంపెనీ అద్భుతమైన బంఫర్ ఆఫర్ ప్రకటించింది. బరువు తగ్గిన ఉద్యోగులకు పది లక్షల రూపాయలు ఇస్తామని వెల్లడించింది.జెరోడా అనేది ఆన్‌లైన్ బ్రోకరేజీ కంపెనీ. తమ ఉద్యోగులకు తాజాగా ప్రకటించిన బంఫర్ ఆఫర్ ప్రకారం.. ఒక్కో ఉద్యోగి రోజుకు 350 క్యాలరీలు తమ బరువులో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇలా ఏడాదిపాటు కష్టపడి టార్గెట్‌లో 90 శాతం సాధించినవారందరికీ నెల జీతం బోనస్ గా ఇస్తామని జెరోడా సీఈవో నితిన్ కామత్ ప్రకటించారు.

అంతేకాకుండా ప్రతి విజేతకు పది లక్షల రూపాయలు ఇస్తామని వెల్లడించారు. దీంతో ఈ ఫిట్‌నెస్ చాలెంజ్‌ను ఉద్యోగులంతా సీరియస్‌గా తీసుకున్నారంట. విజేతగా నిలిచి ఒక నెల జీతం బోనస్‌తోపాటు పది లక్షల రూపాయలను దక్కించుకోవడానికి బరువు తగ్గే పనిలో పడ్డారు.

కాగా ఉద్యోగులు తమ లక్ష్యంలో భాగంగా రోజూ ఏ మేరకు ఎంత కొవ్వు కరిగిస్తున్నారో కంపెనీకి చెందిన ఫిట్‌నెస్ ట్రాకర్ పరిశీలిస్తుంది. తమ కంపెనీ ఉద్యోగుల ఆరోగ్యం ఫిట్‌నెస్ కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఈ కంపెనీకి కొత్త కాదని తెలుస్తోంది. 25 కంటే తక్కువ బీఎంఐ ఉన్న ఉద్యోగులకు ఇప్పటికే సగం నెల జీతం జెరోడా కంపెనీ బోనస్‌గా ఇస్తుండటం విశేషం.

కోవిడ్‌తో వర్క్ ఫ్రం హోం చేస్తూ అధిక బరువును తెచ్చుకుని అనారోగ్యం పాలు కాకుండా ఉండటానికి ఈ విధానం ప్రవేశపెట్టామని కంపెనీ సీఈవో నితిన్ కామత్ చెబుతున్నారు.  కరోనా కాలంలో పెరిగిన బరువును తానెలా తగ్గించుకున్నానో ఆయన కంపెనీ ఉద్యోగులకు చెబుతున్నారు. తద్వారా వారిని కూడా ఆరోగ్యంగా ఉండేలా.. స్థూలకాయాన్ని తగ్గించుకునేలా ప్రోత్సహిస్తున్నారు.  

జెరోడా వ్యవస్థాపకుడు కామత్ తన కంపెనీ సిబ్బంది కోసం ఇలాంటి ఆరోగ్య కార్యక్రమాన్ని ప్రకటించడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది కూడా కామత్ ఉద్యోగులకు ఇదే విధమైన హెల్త్ ఛాలెంజ్ ప్రకటించారు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.