Begin typing your search above and press return to search.

హెచ్ 1బీ వీసా విధానం మార్పు పై కోర్టుకు కంపెనీలు

By:  Tupaki Desk   |   18 Oct 2020 8:30 AM GMT
హెచ్ 1బీ వీసా విధానం మార్పు పై కోర్టుకు కంపెనీలు
X
ట్రంప్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలపై పలు అభ్యంతరాలు వ్యక్తం కావటం తెలిసిందే. ఇటీవల హెచ్ 1బీ వీసా జారీకి సంబంధించి తీసుకొచ్చిన కొత్త మార్పులపై అమెరికాలోని కంపెనీలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. హెచ్ 1బీ వీసా జారీకి సంబంధించి అనుసరించే కొత్త విధానాలతో కంపెనీల మీద భారం మరింత పెరుగుతుందని వాపోతున్నాయి. ఈ కొత్త విధానం వల్ల నిరుద్యోగం మరింత పెరగటమే కాదు.. కంపెనీల మీద పడే ఆర్థిక భారంతో మరిన్నిఇబ్బందులు తప్పవని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ట్రంప్ సర్కారు తీసుకొచ్చిన హెచ్1బీవీసా విధానంలోని మార్పులపై తాజాగా పలు కంపెనీలు న్యూజెర్సీ జిల్లా కోర్టును ఆశ్రయించాయి. ఇటీవల కార్మిక శాఖ నుంచి జారీ అయిన ఆదేశాలపై వారు అభ్యంతరాలువ్యక్తం చేస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం హెచ్ 1బీ వీసాలు జారీ చేసే కంపెనీలు.. ఇప్పటివరకు ఇస్తున్న వేతనాల్ని మార్చేసింది. కనిష్ఠంగా 1.10 లక్షల డాలర్ల కనిష్ఠ వేతనం తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. ఇప్పటివరకు ఇస్తున్న జీతాలతో పోలిస్తే ఇది దాదాపు 30 నుంచి 40 శాతం వరకు పెరుగుతుంది. ఈ విధానంతో కొత్త ఉద్యోగ అవకాశాల్ని దెబ్బ తీయటమే కాదు..

కంపెనీల మీద భారాన్ని పెంచుతుంది.

హెచ్ 1 బీ వీసాల మీద ఉద్యోగాలు చేసే వారిలో 90 శాతం మంది లక్షడాలర్ల లోపు వార్షిక జీతాలకే పని చేస్తుంటారు. అది కాస్తా ఏకంగా 1.10లక్షల డాలర్లను కనీసంగా చేయటం కంపెనీలపై ఆర్థిక భారం తీవ్రంగా పడే ప్రమాదం ఉంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్న కంపెనీలు.. కార్మిక శాఖ విడుదల చేసిన మధ్యంతర ఉత్తర్వుల నుంచి తమకు ఉపశమనం ఇవ్వాలని కంపెనీలు కోరుతున్నాయి. మార్చిన ఈ విధానం వల్ల భారత్ నుంచిఅమెరికాకు వెళ్లాలని భావించే ఐటీ ఉద్యోగుల మీద తీవ్ర ప్రభావం పడనుంది. కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు ఏం చెబుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.