Begin typing your search above and press return to search.

మోడీ గారు మన దేశంలో రైతులు 6 శాతమేనా ఉండేది?

By:  Tupaki Desk   |   10 Aug 2020 9:30 AM GMT
మోడీ గారు మన దేశంలో రైతులు 6 శాతమేనా ఉండేది?
X
అంతన్నాడు.. ఇంతన్నాడు.. కరోనా వేళ 20లక్షల కోట్లతో మోడీ మాయ చేశాడని ఇప్పటికే ఆర్థికవేత్తలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇప్పుడు రైతులకు సాయం పేరిట కూడా మోడీ సర్కార్ పిసినారితనం మరోసారి బయటపడిందని తేటతెల్లమైంది.

135 కోట్ల మంది జనాభా ఉన్న దేశం మనది. ప్రతీసారి మనది రైతు దేశం అని.. 60-65శాతం రైతులు ఉన్న దేశం అని కేంద్ర ప్రభుత్వం గొప్పగా చెప్తుంది. కానీ నిన్న మోడీ రైతులకు పంచిన వితరణ చూస్తే అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. తాజాగా పెట్టుబడి సాయం కింద ప్రధాని మోడీ రైతులకు 2వేలు చొప్పున దేశంలోని కేవలం 8.6 కోట్ల మందికి మాత్రమే ఆర్థిక సాయం చేశారు.

మోడీ సాయాన్ని బట్టి చూస్తే దేశంలోని రైతుల శాతం కేవలం 6శాతమే అని లెక్కతేల్చారు. ఒక వేళ పెద్ద కారు రైతులకు వద్దు అనుకుంటేవాళ్లు ఉండేది 10శాతం అనుకున్నా దాదాపు 50 కోట్ల మందికి రావాలి. ఇంకా పది కోట్ల మంది మధ్యకారు తీసివేసినా 40 కోట్ల మందికి రావాలి.

కానీ మోడీ సార్ ఇచ్చింది కేవలం 8.6 కోట్ల మందికి.. రైతు దేశం అంటూ 65శాతం ఉన్న రైతుల్లో కేవలం 6శాతంమంది మోడీ బిచ్చమేసినట్టేనని.. ఇలా రైతులకు అన్యాయం చేయడం తప్పు అని రైతు సంఘాలు.. రైతులు వాపోతున్నారు. మిగతా 60శాతం మంది రైతులకు సాయం చేయకుండా మోడీ సర్కార్ చోద్యం చూస్తోందని వారంతా విమర్శలు గుప్పిస్తున్నారు.