జనసేన పార్టీ వైపు కమెడియన్ 'అలీ' చూపు.. ఈ వార్తల్లో నిజమెంత?

Fri Sep 30 2022 11:48:31 GMT+0530 (India Standard Time)

Comedian 'Ali' looks towards the Janasena party

 సినీ ఇండస్ట్రీలో జిగ్రీ జానీ దోస్తులు ఎవరైనా ఉన్నారంటే అది 'పవన్ కళ్యాణ్-అలీ'లే. పవన్ కెరీర్లో తొలి నాళ్ల నుంచి అతడి ఫ్రెండ్ క్యారెక్టర్ లో ఒదిగిపోయి పవన్ కు అత్యంత సన్నిహితుడిగా అలీ ముద్రపడిపోయాడు. అయితే  వీళ్లిద్దరి సినిమా అభిరుచులు కలిసినా.. రాజకీయ అడుగులు మాత్రం వేరుగా పడ్డాయి. పవన్ కళ్యాణ్ జనసేన స్థాపించి ఒంటరిగా వెళుతూ అధికార వైసీపీని ఓడించడమే ధ్యేయంగా కదులుతున్నారు. ఇక అలీ సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో ఏపీ రాజకీయాల్లో అధికారంలో ఉన్న వైసీపీ పంచన చేరాడు. పోయినసారి టికెట్ కోసం ట్రై చేసినా దక్కలేదు. జగన్ ఇచ్చే నామినేటెడ్ పదవి కోసం ఎదురుచూస్తున్నాడు.అయితే జగన్ చాలా రోజులుగా అలీకి పదవి ఇవ్వకపోవడంతో అలిగిన అలీ జనసేన వైపు చూస్తున్నారని వార్తలు వచ్చాయి. ఎమ్మెల్యే కావడమే ధ్యేయంగా అలీ అడుగులు వేస్తున్నారు. దానికి వైసీపీలో ఆస్కారం లేదని తన ఫ్రెండ్ అయిన పవన్ పార్టీ జనసేనలో చేరేందుకు చూస్తున్నారని ప్రచారం సాగింది.

పవన్ కళ్యాణ్ ఓ వైపు స్టార్ హీరోగా ఉంటూనే.. ఇంకో వైపు జనసేన అధినేతగా 2024 ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. సినిమాల్లో వీరి ఫ్రెండ్ షిప్ కొనసాగుతున్న రాజకీయంగా ఇద్దరు భిన్న దారుల్లో వేర్వేరు పార్టీలో ఉన్నారు.  

ప్రస్తుతం పవన్ 2024 ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పార్టీని బలోపేతం చేసే దిశగా పోకస్ చేస్తున్నారు. జనసేనను క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించి కమిటీలు వేయాలని చూస్తున్నారు. వైసీపీలో ఉన్నపరిణామాలపై అసంతృప్తిగా ఉన్న అలీ ఇక జనసేనవైపు చూస్తున్నారని టాక్ నడుస్తోంది.

అలీ ఒకవేళ జనసేనలో చేరితే తూర్పు లేదా పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి పోటీలో ఉండే ఛాన్స్ ఉందంటున్నారు.  అలీ స్వస్థలం రాజమండ్రి కావడంతో ఆ సీటు అయినా లేదా? ఆ జిల్లాలోని ఒక సీటును ఆవిస్తున్నట్టు సమాచారం.

జనసేనకు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో బలమైన ఓటు బ్యాంకు ఉంది. కొన్ని గెలిచే స్థానాలున్నాయి. ఈ క్రమంలోనే అలీ ఇందులో ఏదో ఒక స్థానంలో నిలబడి గెలవాలని ప్లాన్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి.

ఇక తాను జనసేనలో చేరుతున్నానన్న ప్రచారంపై అలీ స్పందించారు. కొందరు కావాలనే తనపై కుట్ర చేస్తున్నారని.. తాను వైసీపీని వీడేది లేదని అలీ స్పష్టం చేశారు. పదవులు ప్రయారిటీలకు కోసం తాను వైసీపీలో చేరలేదన్నారు.జగన్ ను సీఎం చేయాలని చేరానని.. జగన్ మనసులో స్థానం ముఖ్యమన్నారు. తాను వైసీపీని వీడేది లేదని స్పష్టం చేశారు.

గతంలో వైసీపీలో చేరిన తర్వాత అలీ.. పవన్ పై చేసిన వ్యాఖ్యలు వీరిద్దరి మధ్య దూరం పెంచాయని అంటున్నారు. ఇదే విషయంపై పవన్ సైతం ఓ సందర్భంలో బాధపడ్డారు. అందుకే అలీ జనసేనలోకి రావడం లేదని తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.