Begin typing your search above and press return to search.

కుప్పకూలిన వేలం పాటదారు.. ఐపీఎల్ వేలం కొద్ది సేపు వాయిదా..

By:  Tupaki Desk   |   12 Feb 2022 10:32 AM GMT
కుప్పకూలిన వేలం పాటదారు.. ఐపీఎల్ వేలం కొద్ది సేపు వాయిదా..
X
రూ.వందల కోట్ల వేలం.. వందల మంది ఆటగాళ్ల కొనుగోళ్లు.. పైకి ఎంత హడావుడిగా కనిపించినా.. లోలోపల ఒత్తిడి సహజం. అది పని ఒత్తిడి కానీ, లేక ఇంకేం ఒత్తిడి కానీ..? ఐపీఎల్ 15వ సీజన్ వేలంలో ఇదే జరిగింది. ప్రధాన నిర్వాహకుడు హ్యూ ఎడ్మెడాస్ అకస్మాత్తుగా కుప్పకూలారు. దీంతో వేలం మధ్యలో మెడికల్ ఎమర్జెన్సీ ఏర్పడింది. వేలం బాధ్యతను నిర్వహిస్తున్న హ్యూ డయాస్ వద్ద

కుప్పకూలిపోయాడు. దీంతో వేలం వాయిదా వేశారు. హ్యూ .. శ్రీలంక ఆటగాడు వనిందు హసరంగాను దక్కించుకునేందుకు వేలం సాగుతున్న సమయంలో స్పృహ తప్పి పడిపోయాడు. అతడు ఆటగాళ్లందరిపై బిడ్లు నిర్వహించే సమయంలో అతడు హఠాత్తుగా కుర్చీ నుంచి కిందపడిపోయాడు. ఆ సమయంలో హసరంగ కోసం ఆర్సీబీ రూ.19.75 కోట్లు ఖర్చుకు బిడ్ వేసింది. గంట విరామం ఐపీఎల్‌ మెగా వేలంలో విరామం తీసుకున్నారు.

రెండో సెట్‌లో చివరి ఆటగాడైన వానిండు హసరంగ కోసం పంజాబ్‌, హైదరాబాద్‌ జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న సమయంలో హ్యూ స్టేజీపైనే కుప్పకూలాడు. దీంతో ప్రస్తుతానికి విరామం ప్రకటించారు. తిరిగి వేలాన్ని 3:30 గంటలకు ప్రారంభించనున్నామని నిర్వాహకులు తెలిపారు. కాగా.. హ్యూ వయసు 63 ఏళ్లు. ఇతడు బ్రిటిషర్. కాగా, స్వల్ప చికిత్స అనంతరం హ్యూ కోలుకున్నట్లు తెలిసింది. మధ్యాహ్నం 3.30కు వేలం తిరిగి ప్రారంభమైంది.