బిగ్ షాక్: కాగ్నిజెంట్ లో 18000 ఉద్యోగులు ఉఫ్?

Sun Jul 05 2020 21:00:01 GMT+0530 (IST)

Cognizant laid off thousands of employees

కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ ఐటీ కంపెనీలపై పడుతోంది. మొన్నటివరకు స్థిరంగా నిలబడ్డ ఐటీ కంపెనీలు రోజులు గడుస్తున్న కొద్దీ నష్టాల బాట పడుతున్నాయి. ఈ క్రమంలో ఎప్పుడు తగ్గుతుందో తెలియని ఈ మహమ్మారి దెబ్బకు దిగ్గజ ఐటీ కంపెనీలు కూడా ఉద్యోగులకు ఎసరు పెడుతున్నాయి.ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ పెద్ద ఎత్తున ఉద్యోగాలను తొలగించేందుకు రెడీ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సంస్థలో ఆశించిన ప్రాజెక్టులు లేకపోవడంతో బెంచ్ కు పరిమితమైన ఉద్యోగులను ఇంటికి సాగనంపేందుకు సిద్ధమైందని సమాచారం.  పనితీరు ఆధారంగా దాదాపు 18000మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధపడిందని వార్తలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ యూనిట్లలో పనిచేస్తున్న వారిని తొలగించాలని చూస్తోందని వార్తలు రావడంతో కాగ్నిజెంట్ స్పందించింది.

అయితే కాగ్నిజెంట్ తాజాగా తమ సంస్థ ఎలాంటి తొలగింపు ప్రకటన చేయలేదని చెప్పారు. తాము ఇప్పటికీ కొత్త నియామకాలు చేస్తున్నామని తెలిపింది.

అయితే పనితీరు బాగాలేని వారికి 45రోజుల సమయం ఇచ్చిందని.. మెరుగుపడని వారికి ప్యాకేజీ ఇచ్చి రాజీనామా చేయమని కాగ్నిజెంట్ కోరుతోందని పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు.ఇప్పటికే తమను కొంత మంది ఉద్యోగులు కలిశారని కర్ణాటక రాష్ట్ర ఐటీస్ ఎంప్లాయిస్ యూనియన్ తెలిపింది. దీనిపై న్యాయపోరాటం తప్పదని తెలిపింది.