సీఎం జగన్ మరో సంచలనం.. కేంద్రానికి లేఖ!

Thu Oct 29 2020 09:00:44 GMT+0530 (IST)

Cm Ys Jagan Write A Letter To Central Govt

ఆంధ్రప్రదేశ్ లో యువతను పెడదోవ పట్టించేలా ఉన్న వెబ్ సైట్లను రద్దు చేయాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు. ఈ మేరకు కేంద్ర న్యాయ ఎలక్ట్రానిక్ సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు సీఎం జగన్ లేఖ రాశారు.ఆంధ్రప్రదేశ్ లో ఆన్ లైన్ గాంబ్లింగ్ బెట్టింగ్ వెబ్ సైట్లు యాప్ లను నిషేధించాలని జగన్ కోరారు. రాష్ట్రంలో మొత్తం 132 వెబ్ సైట్లు ఆన్ లైన్ గాంబ్లింగ్ బెట్టింగ్ కు కారణమవుతున్నాయని సీఎం జగన్ పేర్కొన్నారు.

ఏపీలో 132 వెబ్ సైట్లను నిషేధించాలని కేంద్రమంత్రికి జగన్ విజ్ఞప్తి చేశారు. ఈ బెట్టింగ్ గాంబ్లింగ్ యాప్ లు వెబ్ సైట్లకు యువత బానిస అవుతున్నారని పేర్కొన్నారు. వీటి కారణంగా ఆర్థికంగా నష్టపోతున్నారని సీఎం లేఖలో పేర్కొన్నారు. ఆర్థికంగా నష్టపోయిన యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇలాంటి వాటిని నివారించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1974 ఏపీ గేమింగ్ చట్టంలో సవరణలు తీసుకొచ్చిన విషయాన్ని లేఖలో సీఎం జగన్ ప్రస్తావించారు. యువత భవిష్యత్తు పాడవకుండా వెంటనే కేంద్రం ఈ వెబ్ సైట్లను నిషేధించాలని జగన్ కోరారు.