Begin typing your search above and press return to search.

వ‌ర్గాల వారీ విత‌ర‌ణ‌.. టార్గెట్ హ్యాట్రిక్‌!!

By:  Tupaki Desk   |   6 Feb 2023 10:00 PM GMT
వ‌ర్గాల వారీ విత‌ర‌ణ‌.. టార్గెట్ హ్యాట్రిక్‌!!
X
తాజాగా తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన 2023-24 వార్షిక బ‌డ్జెట్‌ను ప‌రిశీలిస్తే.. ల‌క్ష్యం.. సుస్ప‌ష్టంగా గోచ రిస్తోంది. మూడోసారి ముచ్చ‌ట‌గా.. అధికారంలోకి రావ‌డ‌మే ధ్యేయంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసిన ప్ర‌య త్నాలు.. అంకెల రూపంలో బ‌డ్జెట్ ప‌ద్దులో సాక్షాత్క‌రించాయి. అంతేకాదు.. ప‌క్కా వ్యూహం కూడా ప్ర‌స్ఫుటం గా క‌నిపించింది. వ‌ర్గాల వారీగా స‌మాజాన్ని విడ‌గొట్టి చేసిన కేటాయింపులు.. విత‌ర‌ణ‌లు కేసీఆర్ ల‌క్షిత ల‌క్ష్యాన్ని స్ప‌ష్టం చేస్తున్నాయి.

రాష్ట్ర బడ్జెట్లో సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట కాదు.. ఏకంగా సింహాస‌నే వేసేసింది. వ‌ర్గాల వారీగా సంక్షేమానికి వేల కోట్లు కేటాయించింది. అదేస‌మ‌యంలో వృత్తుల వారీగా గ‌తంలో ఎన్న‌డూ చూడ‌ని.. విధంగా నిధుల విత‌ర‌ణ‌కు తెర‌దీసింది. వీటిలో బీసీల‌కు రూ.6,229 కోట్లు, షెడ్యూల్‌ కులాల ప్రత్యేక ప్రగతికి రూ.36,750కోట్లు కేటాయించి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ సర్వే నిర్వహించి చేనేత, పవర్ లూమ్ కార్మికులను గుర్తించి వారికి జియోట్యాగింగ్ ఇవ్వడం ద్వారా ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు, పథకాల ప్రయోజనాలు పారదర్శకంగా, నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి బదిలీ అవుతున్నాయనేది తాజాగా బ‌డ్జెట్ ప్ర‌సంగంలో చెప్పిన మాట‌. చేనేత కార్మికులకు ఆసరా పింఛన్ అందించడమే కాకుండా, నేతన్నకు బీమా పథకం కింద 5 లక్షల బీమాను అందిస్తున్నామ‌ని కూడా ప్ర‌భుత్వం చెప్పుకొచ్చింది.

గీత కార్మికులకు మరింత లబ్ధి చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నీరాను సాఫ్ట్ డ్రింక్‌గా మార్చి అందించే ప్రాజెక్టును చేపట్టింది. ప్రమాదవశాత్తూ మరణించిన గీత కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల పరిహారాన్ని అందిస్తున్న‌ట్టు స‌ర్కారు పేర్కొంది.

జీఎస్డీపీలో పశుసంపద రంగం వాటా 2014-15లో 6.3 శాతంగా ఉండగా, 2021-22 నాటికి 9 శాతానికి పెరిగింది. పశుసంపద రంగం విలువ 2021-22లో 93,599 కోట్లుగా ఉంది. గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న గొల్ల కురుమలకు 11వేల కోట్ల వ్యయంతో 7.3 లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీ లక్ష్యంగా పెట్టుకుంది.

తెలంగాణలో మాంసం ఉత్పత్తి 2014లో 5.05 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, 2022 నాటికి 10.85 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. మాంస ఉత్పత్తిలో దేశంలో 5వ స్థానంలో నిలిచిన తెలంగాణ "పింక్ రెవల్యూషన్" ను సాధించిందని.. దీనికి 2 వేల కోట్లను కేటాయిస్తున్న‌ట్టు పేర్కొంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.