వైరల్ వీడియో: కస్టమర్ల కోసం కొట్టుకున్న చాట్ వ్యాపారులు

Tue Feb 23 2021 10:15:30 GMT+0530 (IST)

Clash breaks out between two groups of chaat Shop Keepers

లాక్ డౌన్ దెబ్బకు అందరి ఉద్యోగ ఉపాధి దూరమైంది. పైసలు కోసం కాన కష్టమైంది. ఇప్పుడిప్పుడే అన్నీ కోలుకుంటున్నాయి. జనాలు బయటకొస్తున్నారు. ఈ క్రమంలోనే వాటిని అందిపుచ్చుకునే క్రమంలో వీధి వ్యాపారులు పోటీపడుతున్నారు.కరోనా లాక్ డౌన్ దెబ్బకు వీధి వ్యాపారాలన్నీ కుదేలయ్యాయి. అరకొరగా నడుస్తున్నాయి. అయితే అరకొరగా వస్తోన్న కస్టమర్ల కోసం దుకాణాదారులు కొట్టుకుంటున్న వైనం తాజాగా వెలుగుచూసింది.

ఉత్తరప్రదేశ్ లో ఈ దారుణం జరిగింది. బాగ్ పట్ పట్టణంలో రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న వివాదం కాస్త భయానకదాడి వరకు వెళ్లింది. కర్రలు ఇనుపరాడ్లతో ఒకరిపై ఒకరు దాడికి దిగి నానా హంగామా సృష్టించారు. విచక్షణారహితంగా కర్రలతో కొట్టుకుంటూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు. వీధి రౌడీలను మించి  వీధి వ్యాపారులు కొట్టుకున్నారు. చాట్ దుకాణాలకు ప్రసిద్ధిగాంచిన బాగ్ పట్ సిటీలో సోమవారం మధ్యాహ్నం ఈ అరాచక దాడులు కొనసాగాయి.

దివాళా తీసిన వ్యాపారులు ఇప్పుడు కస్టమర్ల కోసం ఆకర్షించే ప్రయత్నంలో వాగ్వాదం జరిగి గొడవకు.. దాడులకు దారితీసింది. తలలు పగుల కొట్టుకునే వరకు వెళ్లింది. కరోనా లాక్ డౌన్ తో ఉపాధి కోసం ఇలా కొట్టుకుంటున్న దుస్థితి చూసి నెటిజన్లు అయ్యో పాపం అంటూ నిట్టూరుస్తున్నారు.