Begin typing your search above and press return to search.

ఈసీ-ప్రతిపక్షాల మధ్య ఘర్షణ తప్పదా ?

By:  Tupaki Desk   |   5 Oct 2022 1:30 PM GMT
ఈసీ-ప్రతిపక్షాల మధ్య ఘర్షణ తప్పదా ?
X
రాజకీయపార్టీలు ఎన్నికల్లో ఇచ్చే హామీల అమలుపై తమ స్పష్టమైన ప్రణాళికను వివరించాలని కేంద్ర ఎన్నికల కమీషన్ అన్నీ గుర్తింపుపొందిన రాజకీయపార్టీలకు నోటీసులు జారీచేసింది. ఈనెల 19వ తేదీలోగా తమ నోటీసులకు సమాధానాలను ఇవ్వాలని ఆదేశించింది. ఒకవేళ తమ నోటీసులకు సమాధానాలు ఇవ్వకపోతే సమాధానాలు చెప్పటానికి ఏమీలేదని అనుకోవాల్సుంటుందని పేర్కొన్నది. ఎన్నికల్లో గెలిచేందుకు ఇస్తున్న ఉచిత హామీలను కంట్రోల్ చేయటం, పథకాల అమలుకు నిధులను ఎక్కడినుండి సమీకరిస్తారో చెప్పాల్సిందే అని కమీషన్ తన నోటీసులో స్పష్టంచేసింది.

కమీషన్ జారీచేసిన నోటీసును కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, శివసేన పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బీజేపీ ప్రోదల్బంతోనే కమీషన్ ఇలాంటి నోటీసును జారీచేసిందని పై పార్టీల సీనియర్ నేతలు మండిపోతున్నారు.

తమ పార్టీల మ్యానిఫెస్టోల్లో తలదూర్చే అవకాశం కమీషన్ కు లేదన్నారు. హామీలను ఎలా అమలుచేస్తామనేది తమ పార్టీల అంతర్గత వ్యవహారమని వాటిని కమీషన్ కు ఎలా చెబుతామంటు కాంగ్రెస్ సీనియర్ నేత జై రామ్ రమేష్ కమీషన్ను నిలదీశారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేయకపోతే జనాలే పార్టీలను తిరస్కరిస్తారని రమేష్ గుర్తుచేశారు. కాబట్టి ఎలాంటి హామీలివ్వాలి, అమలుకు ఉన్న మార్గాలేమటని పార్టీలే చూసుకుంటాయన్నారు. హామీలు, వాటి అమలు మార్గాలపై ఎన్నికల కమీషన్ జోక్యం చేసుకోవాల్సిన పనిలేదన్నారు.

కేంద్ర దర్యాప్తు సంస్ధలైన ఎన్ఫోర్స్ మెంటు డైరెక్టరేట్, సీబీఐలను ప్రతిపక్షాలపై ఉసిగొల్పుతున్నట్లే ఇపుడు ఎన్నిక కమీషన్ను కూడా ఉసిగొల్పుతోందని రమేష్ ఘాటుగా స్పందించారు.

ఇలాంటి పద్దతిలోనే తృణమూల్ కాంగ్రెస్, శివసేన నేతలు కూడా స్పందించారు. చూడబోతుంటే కమీషన్ తో రాజకీయపార్టీలకు ఘర్షణ తప్పేట్లు లేదు. ఇదే విషయమై సుప్రింకోర్టు విచారణ సందర్భంగా ఉచిత హామీలు ఇవ్వకుండా రాజకీయపార్టీలను నియంత్రించేమని ఇదే కమీషన్ చేతులెత్తేసింది. ఇంతలోనే ఏమైందో ఏమో ఇపుడు ఉచిత హామీల అమలుపై నోటీసులిచ్చింది. 19వ తేదీ తర్వాత ఏమవుతుందో చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.