భర్త అతిగా ప్రేమిస్తున్నాడని భార్య చేసిన పని..!

Sat Aug 24 2019 16:04:04 GMT+0530 (IST)

Choked by Husband Extreme Love and Affection

భర్త బాగా తాగొచ్చి కొడుతున్నాడని కొందరు.. లేదు భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని కొందరు.. భార్య బిడ్డలను పట్టించుకోవడం లేదని మరికొందరు.. ఇక భార్త టార్చర్ పెడుతున్నాడని మరికొందరు కోర్టుకెక్కి విడాకులు తీసుకోవడం కామన్. కానీ ఢిల్లీ శివారు నోయిడాలో జరిగిన వింతైన విడాకులు కేసు ఇప్పుడు ఎలా తేల్చాలో తెలియక ఆ జడ్జి బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాడట..ప్రస్తుతం సిల్లీ కారణాలకు విడాకులు ఎక్కువైపోతున్నాయి. చిన్నచిన్న తప్పులకు విడిపోతున్న జంటలు ఎన్నో ఉన్నాయి. ఇద్దరు ఆర్థికంగా ఉండి బాగా సంపాదిస్తూ - ఒకరి అవసరం ఒకరు లేకుండా బతుకుతూ చిన్న చిన్న గొడవలు - ఇగోలకు విడిపోతున్న జంటలెన్నో ఉన్నాయి. అయితే తాజాగా నోయిడాకు చెందిన ఓ భార్య సీమా కౌశిక్ తనకు విడాకులు కావాలంటూ కోర్టుకెక్కింది. ఆమెచెప్పిన కారణం విని జడ్జి విస్తుపోయాడు.

తన భర్త యశ్వింత్ సింగ్ అతి ప్రేమను భరించలేకపోతున్నాంటూ ఆమె విడాకులు కోరడం సంచలనంగా మారింది. భార్యపై ప్రేమతో ఆ భర్త ఆమెను ఇంట్లో కూర్చుండబెట్టి వంట ఇంటిపని అంతా కానిచ్చేస్తున్నాట.. భోజనం నుంచి బాత్రూం దాకా అన్ని చేసిపెడుతున్నాడట.. ఆయన అతి ప్రేమ తనకు చికాకు పుట్టిందని వెంటనే విడాకులు ఇవ్వాలని  సీమా కోర్టును ఆశ్రయించడం విశేషం. అయితే భర్త మాత్రం తనకు భార్య సీమా అంటే ఎంతో ఇష్టమని.. అందుకే ఇలా ప్రేమ చూపించానని విడాకులు వద్దు అనడం కొసమెరుపు..

అయితే ఇలాంటి కేసును ఎదుర్కోవడం ఆ జడ్జి చరిత్రలోనే కొత్త అట.. ఈ కేసులో విడాకులు ఇవ్వడం సాధ్యం కాదని.. ఇంట్లోనే పెద్ద మనుషుల సమక్షంలో తేల్చుకోండని సదురు జడ్జి చెప్పి కేసును కొట్టివేయడం విశేషం.

TAGS: