Begin typing your search above and press return to search.

విశాఖ ఉక్కు ప్ర‌యివేటీక‌ర‌ణ‌పై చిరు కౌంట‌ర్

By:  Tupaki Desk   |   22 April 2021 1:30 PM GMT
విశాఖ ఉక్కు ప్ర‌యివేటీక‌ర‌ణ‌పై చిరు కౌంట‌ర్
X
విశాఖ ఉక్కు క‌ర్మాగారాన్ని ప్ర‌యివేటీక‌ర‌ణ చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణ‌యాన్ని ఏపీ ప్ర‌జ‌లు వ్య‌తిరేకిస్తున్నారు. దీనికి సినీప్ర‌ముఖుల నుంచి మ‌ద్ధ‌తు ల‌భించింది. ప్ర‌స్తుత కోవిడ్ ప‌రిస్థితుల్లో విశాఖ ఉక్కుతో దాగి ఉన్న మ‌రో ప్ర‌యోజ‌నాన్ని వివ‌రిస్తూ మెగాస్టార్ చిరంజీవి కేంద్రంపై వేసిన కౌంట‌ర్ సంచ‌ల‌నంగా మారింది. ప్రస్తుతం మన రాష్ట్రంలోని కొవిడ్‌ ఆస్పత్రులకు అవసరమైన ప్రాణ వాయువులో సుమారు మూడో వంతు విశాఖ ఉక్కు కర్మాగారమే సరఫరా చేస్తోంది. అయితే ఈ ఆక్సిజ‌న్ ని త‌ర‌లించుకుపోయేందుకు ముంబై నుంచి రైలు వ‌స్తోంద‌ని.. ఇంత సేవ చేస్తున్న విశాఖ ఉక్కును ప్ర‌యివేటీక‌ర‌ణ చేయ‌డం స‌బ‌బేనా? అని చిరు ప్ర‌శ్నించారు.

మెగాస్టార్ ట్వీట్ చేస్తూ..``దేశమంతా ఆక్సిజన్ దొరక్క కరోనా పేషెంట్స్ అల్లాడిపోతున్నారు. ఈరోజు ఓ స్పెషల్ ట్రైన్ విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చేరింది. అక్కడి నుంచి 150 టన్నుల ఆక్సిజన్ ని మహారాష్ట్రకు తీసుకెళ్తోంది. విశాఖ ఉక్కు కర్మాగారం రోజుకి సుమారు 100 టన్నుల ఆక్సిజన్ ను ఉత్పిత్తి చేస్తుంది. ఇప్పుడున్న అత్యవసర పరిస్థితిలో ఎన్నో రాష్ట్రాలకు ఆక్సిజన్ అందించి లక్షల మంది ప్రాణాలని నిలబెడుతోంది. అలాంటి విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల్లో ఉందని ప్రైవేట్ పరం చేయడం ఎంత వరకు సమంజసం?? మీరే ఆలోచించండి`` అంటూ కేంద్ర ప్రభుత్వంపై మెగాస్టార్ త‌న‌దైన శైలిలో పంచ్ వేశారు.

మెగాస్టార్ వ్యాఖ్య‌లు స‌ముచిత‌మైన‌వి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హ‌క్కు అని నిన‌దించి వ‌దిలేసిన ఎంద‌రో నాయ‌కులు మ‌ళ్లీ పోరాటానికి దిగుతారా లేదా చూడాలి. ఆస‌క్తిక‌ర విష‌యం ఏమంటే కేవ‌లం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోనే ఆక్సిజ‌న్ స‌రిగా స‌రిపోక చాలా చోట్ల యువ‌జ‌నులు మ‌హ‌మ్మారీకి బ‌లైపోవ‌డం విషాదం నింపుతుంటే ఇక్క‌డి నుంచి ఆక్సిజ‌న్ మ‌హారాష్ట్ర‌కు త‌ర‌లిపోతోంది. ఇది మ‌రీ అన్యాయం..!