వీడియో: భార్య కోసం భర్త కుర్చీగా మారాడు

Sun Dec 08 2019 12:38:12 GMT+0530 (IST)

Chinese man becomes human chair for pregnant wife

నాతి చరామి ధర్మేచా అర్థేచా కామేచా.. అని ప్రమాణం చేసి పడతికి తాళికట్టిన మగాడు ఆ తరువాత పెళ్లినాటి ప్రమాణాలను పాటించాలని సనాతన ధర్మం చెబుతోంది. కానీ నేటి ఆధునిక యుగంలో కలి కాలం మహిమతో భార్యాభర్తల కీచులాటలు ఏ స్థాయికి చేరుకుంటున్నాయో చూస్తున్నాడే. అన్ని ప్రమాణాల్ని గాలికొదిలేసి కలహించుకుంటున్న వైనం కనిపిస్తోంది.  ముచ్చటగా సాగాల్సిన ప్రేమ బంధాన్ని మున్నాళ్ల ముచ్చటగా ముగించుకుంటున్నారు.పురాణాల్లో భార్యల గొప్పను ఎంతో బాగా చెప్పారు. భర్త కోసం యముడినే ఎదిరించింది సతీసావిత్రి.. భార్య అంటే ఇలాగే వుండాలని మహిళలకు ప్రతీకగా నిలిచింది అరుంధతి.. అయితే భార్య కోసం సాహసాలు చేసిన భర్తల గురించి మాత్రం ఏ చరిత్రలోనూ ప్రస్తావించలేదు. తన భార్యపై వున్న ప్రేమకు చిహ్నంగా షాజహాన్ తాజ్ మహాల్ కట్టించాడు. భాగమతిపై ప్రేమతో ఓ రాజు భాగ్యనగరాన్నే నిర్మించి భార్యలే కాదు భర్తలు కూడా గొప్పే అని నిరూపించాడు. అంతేకాదు.. అంతకుమించి అనిపించేలా ఇదిగో ఈ సీన్ చూశారా?

నేటి అధునిక యుగంలో ఈ ఆదర్శ భర్త గురించి తెలుసుకుని తీరాలి. గర్భంతో వున్న తన భార్యకు ఆస్పత్రి ఆవరణలో సరైన వసతి లేకపోవడంతో తనే కుర్చీగా మారిపోయాడు ఆ భర్త. చైనాలో ప్రెగ్నెన్సీతో వున్న తన భార్యను డాక్టర్ కు చూపించాలని ఓ వ్యక్తి హాస్పటల్ కు తీసుకొచ్చాడు. అయితే అక్కడ కూర్చోవడానికి చైర్స్ వున్నా ఖాళీ లేక భార్య నిలబడటానికి ఇబ్బందిపడుతుండటంతో తానే తన భార్యకు కుర్చీగా మారిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భార్యపై భర్తకున్న ప్రేమను చూసిన నెటిజనులు ఓ రేంజ్ లో భర్తపై ప్రశంసలు కురిపిస్తున్నారు.