Begin typing your search above and press return to search.

సెలబ్రెటీలపై చైనా ప్రభుత్వం ఉక్కుపాదం..పన్ను పేరిట కఠిన చర్యలు

By:  Tupaki Desk   |   28 Nov 2021 9:59 AM GMT
సెలబ్రెటీలపై చైనా ప్రభుత్వం ఉక్కుపాదం..పన్ను పేరిట కఠిన చర్యలు
X
ప్రపంచ దేశాలు ఒక వైపు ఉంటే.. చైనా మరో వైపు ఉంటుంది. మిగతా దేశాలతో సంబంధం లేకుండా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటుందీ డ్రాగన్ దేశం. ప్రతీ విషయంతో తమకు నచ్చిన విధంగా చేయడానికి ఏమాత్రం వెనుకాడకు ఇక్కడి కమ్యూనిస్టులు. వ్యాపార, ఆర్థిక వ్యవహారాల్లో దేశానికి ముప్పు తెచ్చే అవకాశం ఉండడంతో వాటిపై కఠిన చర్యలు తీసుకుంటారు. అవసరమైతే జైలు శిక్ష వేస్తారు.. ఇంకేదో చేస్తారు.. మొత్తానికి ప్రభత్వం అనుకున్నది సాధిస్తుంది. తాజాగా డ్రాగన్ ప్రభుత్వం సెలబ్రెటీలపై విరుచుకుపడుతోంది. వారి దూకుడుకు అడ్డుకట్ట వేస్తోంది. సెలబ్రెటీలు కంట్రోల్ లో ఉండేందుకు ప్రభుత్వం రకరకాల చర్యలు తీసుకుంటోంది. ఇంతకీ చైనా ఏం చేస్తోంది..? ఇక్కడి సెలబ్రెటీలు ఎందుకు భయపడుతున్నారు..?

గత కొన్నాళ్లుగా చైనా ప్రభుత్వం ఇక్కడి సెలబ్రెటీలపై ఉక్కుపాదం మోపుతోంది. సినిమాల్లో నటించేవారు, ఇతర సెలబ్రెటీలో ఎక్కువగా పాపులర్ కాకుండా చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా వినోద రంగానికి చెందిన వారిపై కొత్త ఆంక్షలు పెడుతూ వారిని ఎదగనీయకుండా చేస్తోంది. ఇందులో భాగంగా సోషల్ మీడియాలో వారి గురించి తెలియకుండా జాగ్రత్తపడుతోంది. కొందరు సెలబ్రెటీలు ఇప్పటికే తమ గురించి న్యూస్ పెడితే వాటిని వెంటనే తొలగించేలా చేస్తోంది. ఇక వారి సంపద, ప్రతిభను కూడా ఇతర దేశాలకు తెలియకుండా చేస్తోంది. సెలబ్రెటీ కల్చర్ కు చెక్ పెట్టేందుకే ఇలాంటి రూల్స్ తీసుకొచ్చామని సైబర్ స్పేస్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫ్ చైనా తెలిపింది.

చైనా ప్రభుత్వం మనసులో సెలబ్రెటీలపై బ్యాడ్ ఓపినీయన్ ఉంది. పాశ్చాత్య సంస్కృతికి వ్యతిరేకంగా ఉండాలని ఇలాంటి ఆంక్షలు విధిస్తున్నట్లు తెలుస్తోంది. సెలబ్రెటీ కల్చర్ దేశానికి ముప్పు తెచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నందున దానిని ప్రోత్సహించొద్దని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా సోషల్ మీడియాలో ఉన్న సెలబ్రెటీల వీడియోలు, ఫొటోలను తొలగించింది. అలాగే వెబ్ సైట్లలో ఉన్న వారి వివరాలను తీసేసింది. మొత్తంగా వారిని ఫ్యాన్స్ కు దూరంగా ఉండేలా ప్రవర్తిస్తోంది. వీరు ఎక్కువగా పేరు తెచ్చుకుంటే దేశానికి ముప్పు వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తోంది.

చైనాలోని సెలబ్రెటీల్లో జెంగ్ షువాంగ్ ఒకరు. టీవీ షో 'మేటర్ షవర్' ద్వారా టీవీ ప్రేక్షకులకు పరిచయం అయిన జెంగ్ షువాంగ్ ఆ తరువాత సినిమా రంగంలో అడుగుపెట్టి సెలబ్రెటీ అయింది. దేశంలోని సెలబ్రెటీల్లో జెంగ్ షువాంగ్ మొదటి స్థానంలో నిలిచారు. మిగిలిన వారికంటే ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. అయితే ఇంతటి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం ఆమెకు ఇబ్బందికరంగా మారింది. తాజాగా చైనా ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం ద్వారా జెంగ్ షువాంగ్ పై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆమె ప్రభుత్వానికి పన్నులు కట్టడం లేదనే నెపంతో ఆమెతో రూ.337 కోట్ల జరిమానా కట్టించుకుంది. అలాగే రెగ్యులేటర్ టీవీలో ఆమెకు సంబంధించిన షోలను నిలిపివేయించింది.

సాధారణంగా ఏ దేశంలో అయినా పరిమితికి మించి ఆదాయం ఉంటే కచ్చితంగా ప్రభుత్వానికి పన్ను కట్టాల్సిందే. కానీ చైనా దేశం మాత్రం కఠిన వైఖని అవలంభిస్తోంది. సామాన్యులైనా.. సెలబ్రెటీలైనా పన్ను కట్టకపోతే వారిపై ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగానే చైనా నటి జెంగ్ షువాంగ్ కు ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. మొత్తంగా ఆమెతో 337 కోట్ల రూపాయలు కట్టించింది. ఈ మేరకు చైనా ఆదాయ శాఖ వారు నటి నుంచి ఆ మొత్తాన్ని వసూలు చేశారు.

జెంగ్ షువాంగ్ తాను నటిస్తున్న టీవీ, సినిమాల నుంచి వచ్చిన ఆదాయం పొందుతున్నా టాక్స్ కట్టలేదని షాంఘై మున్సిపల్ ట్యాక్స్ సర్వీస్ గుర్తించింది. చైనాలో ప్రజల మధ్య ఆదాయ భేదాలను తగ్గించేందుకు ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని ప్రభుత్వ అధికారులు పేర్కొంటున్నారు.