Begin typing your search above and press return to search.

ట్రేడ్ వార్: భారీ కాంట్రాక్ట్ రద్దు చేసి చైనాకు భారత్ షాక్

By:  Tupaki Desk   |   18 Jun 2020 11:30 AM GMT
ట్రేడ్ వార్: భారీ కాంట్రాక్ట్ రద్దు చేసి చైనాకు భారత్ షాక్
X
కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాతో ట్రేడ్ వార్ కు దిగింది భారత్. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తాజాగా చైనా కంపెనీలకు షాకిచ్చింది. భారత ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ లో 5జీ అప్ గ్రేడ్ కాంట్రాక్ట్ ప్రాజెక్టులో చైనా కంపెనీలకు చెక్ పెట్టిన కేంద్రం తాజాగా రైల్వే కాంట్రాక్టు పనుల్లోనూ కోతపెట్టింది. తాజాగా చైనా కంపెనీకి అప్పగించిన రైళ్ల సిగ్నలింగ్ అండ్ టెలికమ్యూనికేషన్ల కాంట్రాక్ట్ పనులను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కాంట్రాక్ట్ పనుల విలువ ఏకంగా రూ.471 కోట్ల రూపాయలు కావడం గమనార్హం. దీంతో భారత్ తాజాగా చైనాతో ట్రేడ్ వార్ కు శ్రీకారం చుట్టినట్టేనని తెలుస్తోంది.

భారత సైనికులు 20మందిని చంపిన చైనా దుస్సహాసానికి ప్రతీకారంతో రగులుతున్న భారత్ కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. 20 మంది సైనికుల త్యాగాలను వృథా కానివ్వబోమంటూ ప్రధాని మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించగానే కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా ట్రేడ్ వార్ కు దిగింది.

కేంద్రం గూడ్స్ రైళ్ల రాకపోకల కోసం ప్రత్యేకంగా కారిడార్ నిర్మిస్తోంది. స్లోగా వెళ్లే వాటి రాకపోకలకు ఎలాంటి ఆటంకం లేకుండా సరుకుల చేరవేతలో వేగాన్ని పెంచడం.. ప్రయాణ రైల్వేలకు ఆటంకలం కలుగుకుండా కొత్త కారిడార్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే సిగ్నల్లు - టెలికమ్యూనికేషన్ వ్యవస్థ కాంట్రాక్ట్ పనులను చైనా కంపెనీ బీజింగ్ నేషనల్ రైల్వే రీసెర్చ్ డిజైన్ ఇన్ స్టిట్యూట్ సంస్థకు పనులు అప్పగించింది. కాన్పూర్ టు -దీన్ దయాల్ ఉపాధ్యాయ సెక్షన్ మధ్యన ఏర్పాటు చేసేందుకు చైనా సంస్థకు 471 కోట్ల కాంట్రాక్టు ఇచ్చింది.

తాజాగా ఈ కాంట్రాక్ట పనులను రద్దు చేస్తున్నట్టు రైల్వేశాఖ ప్రకటించింది. దీంతో చైనా దేశానికి తొలి షాకిచ్చింది. మున్ముందు చైనా సంస్థల కాంట్రాక్టులన్నీ రద్దు దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది.