Begin typing your search above and press return to search.

బాబుకు చైనా పరామర్శ... ?

By:  Tupaki Desk   |   19 Jan 2022 4:32 PM GMT
బాబుకు చైనా పరామర్శ... ?
X
చంద్రబాబునాయుడు 2019 ఎన్నికల్లో ఓడాక కేవలం ఏపీ రాజకీయాలకే పరిమితం అయి ఉన్నారు కానీ ఆయన ఉమ్మడి ఏపీ సీఎం గా ఉన్నప్పటి నుంచి చూస్తే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఒక వెలుగు వెలిగారు. చంద్రబాబు హయాంలోనే బిల్ క్లింటన్ ని కూడా ఒకసారి హైదరాబాద్ తీసుకువచ్చారు. అలాగే ఆయన అనేక సార్లు విదేశీ పర్యటనలు చేసి అక్కడ ప్రముఖులతో భేటీలు వేసేవారు.

ఒక విధంగా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అని బాబు గురించి తెలియని వారు ఎవరూ లేరు. అలాంటి చంద్రబాబు ఇపుడు ఏపీలోనే గట్టిగా పరిశ్రమిస్తున్నారు. పోయిన చోటనే తన పార్టీని నిలబెట్టుకోవాలని, తద్వారా మళ్లీ పూర్వ వైభవాన్ని తెచ్చుకోవాలని చూస్తున్నారు. ఇక తాజాగా చూస్తే చంద్రబాబు కరోనా బారిన పడ్డారు. ఆయన ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉంటూ వైద్య చికిత్సలు పొందుతున్నారు.

దాంతో ఆయన త్వరగా కోలుకోవాలని దేశంలోని ప్రముఖులు అంతా కోరుకుంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్ సైతం బాబు త్వరగా ఆరోగ్యవంతులు కావాలని ఆకాంక్షించారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే భారత్ లో చైనా రాయబారిగా ఉన్న సున్ వెయిడాంగ్ బాబుకు ఏకంగా ఒక లేఖ రాశారు.

ఆ లేఖలో చంద్రబాబును పరామర్శిస్తూనే కరోనా నుంచి తొందరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఈ లేఖను తెలుగుదేశం అధికార వెబ్ సైట్ లో ఉంచారు. మొత్తానికి చంద్రబాబుకు ఉన్న పలుకుబడి ఎలాంటిది అన్నది ఇపుడు చైనా రాయబారి పరామర్శ ద్వారా లోకానికి వెల్లడైంది అని అంతా అంటున్నారు. ఏది ఏమైనా బాబు దిగ్గజ నేత. ఆయన ఆరోగ్యవంతుడిగా మారి మరింత ఉత్సాహంతో రాష్ట్రానికి సేవ చేయాలని అంతా కోరుకుంటున్నారు.