Begin typing your search above and press return to search.

చైనా బరితెగింపు.. భారత్ ధీటైన సమాధానం

By:  Tupaki Desk   |   18 Jun 2020 4:45 AM GMT
చైనా బరితెగింపు.. భారత్ ధీటైన సమాధానం
X
20 మంది భారత సైనికులను చంపిన చైనా తాజాగా మరోసారి బరితెగించింది. గాల్వన్ వ్యాలీ తమదేనంటూ చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.ఈ ప్రకటనకు భారత్ కూడా ధీటైన సమాధానం ఇచ్చింది. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కానిదని చైనాకు స్పష్టం చేసింది.

ఇటీవల ఇరుదేశాల విదేశాంగ మంత్రుల మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణలో సరిహద్దు సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందామన్న ఒప్పందాన్ని గుర్తు చేశారు. జూన్ 6న ఇరుదేశాల మిలటరీ కమాండర్స్ మధ్య జరిగిన ఒప్పందాన్ని నిబద్ధతతో అమలు చేయాలని చెప్పింది. కానీ చైనా గాల్వాన్ లోయ తమదే అనడం విరుద్ధమని భారత్ బుధవారం అర్ధరాత్రి ప్రకటన జారీ చేసింది.

భారత్-చైనా సైనికుల మధ్య తలెత్తిన ఘర్షణల తర్వాత ఈ ప్రకటన వెలువరించింది.భారత్ తో సరిహద్దు వివాదాన్ని మరింతగా పెంచేదిగా ఇది మారింది. ఇరు దేశాల విదేశాంగ మంత్రుల చర్చ గాల్వాన్ లోయ పాయింట్ లేదని చైనా స్పష్టం చేసింది.

ఓ వైపు వివాదాలు వద్దు అనుకుంటూనే గాల్వన్ వ్యాలీ తమదేనని ప్రకటించుకోవడం ద్వారా చైనా ద్వంద్వ నీతిని బయటపెడుతోంది. గాల్వాన్ లోయలోకి కాలుపెట్టి చైనా తాజాగా భారత్ తో కయ్యానికి కాలుదువ్వుతోంది. భారత్ కంటే తామే శక్తిమంతులమని నిరూపించుకోవడానికి బలం ప్రయోగిస్తోంది. భారత్ కూడా తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్-చైనా మధ్య మున్ముందు పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయన్నది ఉత్కంఠగా మారింది.