జపాన్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన చైనా .. ఏ విషయంలో అంటే ?

Tue Jul 20 2021 16:45:36 GMT+0530 (IST)

China issued a strong warning to Japan

చైనా జపాన్ మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఘర్షణ కొనసాగుతుంది. ఇరుగుపొరుగు దేశాలతో చైనాకు ఘర్షణ ఇంకా కొనసాగుతోంది. తైవాన్ తమ ఆదీనంలోనే ఉందని ఇప్పటికీ స్పష్టం చేస్తున్నది.  తైవాన్ విషయంలో ఎవరు జోక్యం చేసుకున్నా ఊరుకునేది లేదని తేల్చిచెప్పింది.  ఈ విషయంలోనే ఏకంగా జపాన్ కి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. చైనా పొరుగు దేశమైన జపాన్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడానికి ప్రధాన కారణం..కొన్ని రోజుల క్రితం జపాన్ ఉప ప్రధాని తారో అసో తైవాన్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. బయటి శక్తులు తైవాన్ పై ఆదిపత్యం చలాయించాలని చూస్తే ఊరుకోబోమని అండగా ఉంటామని తైవాన్ కు హామీ ఇచ్చారు.జపాన్ వ్యాఖ్యల తరువాత చైనా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది.   తైవాన్ విషయంలో జపాన్ జోక్యం చేసుకుంటే బాంబులు వేస్తామని ఒక్క సైనికుడు గాని ఒక్క యుద్ధ విమానంగాని తైవాన్ సరిహద్దుల్లోకి వస్తే అణుయుద్ధం తప్పదని జపాన్ ను నామరూపాలు లేకుండా చేస్తామని చైనా హెచ్చరించింది. చైనా ఇరుగు పొరుగుదేశాలతో వైరం తెచ్చుకుంటోంది. ఇప్పటికే ఇండియా వియత్నాం తైవాన్ దేశాలతో ఘర్షణ వైఖరి అవలంభిస్తున్న చైనా జపాన్ తో కూడా వివాదం తెచ్చుకుంది. జపాన్ ను హెచ్చరిస్తూ చైనాలోని కమ్యూనిస్టు పార్టీ అధికారిక ఛానెల్ ఓ వీడియోను ప్రసారం చేసింది. ఆ తరువాత వీడియోను ఆ ఛానల్ డిలీట్ చేసింది.  

తైవాన్ విషయాన్ని చైనా అంతర్గతంగా భావిస్తోంది. తైవాన్ విషయంలో జోక్యం చేసుకుంటే ఊరుకునేది లేదని చెబుతోంది. అవసరమైతే అణు ఆయుధాలు ప్రయోగిస్తామని జపాన్ ను హెచ్చరించింది చైనా. తైవాన్ విషయంలో కలుగ జేసుకున్నందుకు జపాన్‌పై బాంబులు వేస్తామని హెచ్చరించింది. తరువాత లొంగిపోయామని బతిమాలుకునేవరకూ మళ్లీ బాంబులేస్తామని వెల్లడించింది. తైవాన్ విముక్తి తమ చేతుల్లో అంశమని జపాన్ జోక్యం సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది