Begin typing your search above and press return to search.

తైవాన్ పై క్షిపణులతో విరుచుకుపడ్డ చైనా.. దారుణ వీడియోలు వైరల్

By:  Tupaki Desk   |   5 Aug 2022 4:37 PM GMT
తైవాన్ పై క్షిపణులతో విరుచుకుపడ్డ చైనా.. దారుణ వీడియోలు వైరల్
X
అగ్రరాజ్యం అమెరికా స్పీకర్ తైవాన్ లో పర్యటించడాన్ని పొరుగున ఉన్న చైనా దేశం జీర్ణించుకోవడం లేదు. అందుకే తైవాన్ జలసంధిపై క్షిపణులతో విరుచుకుపడింది. ఈ చర్య అంతర్జాతీయ సమాజంలో కలకలం రేపింది. చైనా సైన్యంపై తైవాన్ సమీపంలో బాంబులు కురిపించిన వీడియోను ఆ దేశ అధికారిక మీడియా సీసీటీవీ విడుదల చేసింది.ఈ దృశ్యాలు ప్రపంచదేశాలను విస్మయానికి గురిచేశాయి.

ఇక తైవాన్ జలసంధిపై డాంగ్ ఫెండ్ క్షిపణలును ప్రయోగించి తమ సైన్యం అనుకున్న ఫలితాలు సాధించిందని చైనా సైన్యం ప్రకటించింది. సైనిక క్రీడల పేరుతో తైవాన్ పైకి చైనా తన అధునాతన యుద్ధ విమాన నౌక, అణ్వస్త్ర సామర్థ్య జలాంతర్గామిలను పంపింది. తైవాన్ లోని జపాన్ ఎక్స్ క్లూజివ్ ఎకనామిక్ జోన్ సమీపంలో ఈ క్షిపణులు పడడంతో కలకలం రేపింది. క్షిపణి పరీక్షలంటూ చైనా రాకెట్లను ప్రయోగించడం ఇది రెండోసారి కావడం గమనార్హం.

చైనా సైన్యం క్షిపణి ప్రయోగాల నేపథ్యంలో అప్రమత్తమైన తైవాన్ తన పౌర విమానాల రాకపోకలను ఆపేసింది. రాజధాని తైపేలోని ఎయిర్ పోర్ట్ నుంచి దాదాపు 50 విమాన సర్వీసులు రద్దు చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా తైపీ నుంచి తరలివెళ్లే ప్రాసెస్ చిప్ లకు కొరత ఏర్పడడం ఖాయంగా మారింది. వీటిని సముద్రమార్గాన కొనసాగిస్తారా? లేదా? అన్న దానిపై సందిగ్ధత నెలకొంది.

ఇక చైనా సైనిక డ్రిల్స్ చేస్తున్న ఇదే ప్రాంతానికి అమెరికా గస్తీ విమానం, జలాంతర్గామి విధ్వంసక హెలిక్యాప్టర్ లు వచ్చి ఉద్రిక్తతలు పెంచాయి. ఇక తైవాన్ సైతం మిరాజ్, ఎఫ్5 యుద్ధ విమానాలతో చైనా దళాలున్న చోటకు వెళ్లి తొడగొట్టాయి.

దీంతో చైనా, తైవాన్ మధ్య యుద్ధం తప్పదా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. తైవాన్ కు మద్దతుగా ఆ సముద్ర జలాల్లో అమెరికా యుద్ధ విమానాలు, యుద్ధనౌకలు మోహరించడంతో ఉద్రిక్తత నెలకొంది. చైనా యుద్ధానికి దిగితే తగిన మూల్యం చెల్లించకతప్పదని అంటున్నారు.

వీడియో