Begin typing your search above and press return to search.

చైనాకి అంతా తెలిసే జరిగింది ..కరోనా పై అసలు నిజం బయటపెట్టిన వైరాలజిస్ట్ !

By:  Tupaki Desk   |   11 July 2020 4:40 PM GMT
చైనాకి అంతా తెలిసే జరిగింది ..కరోనా పై అసలు నిజం బయటపెట్టిన వైరాలజిస్ట్ !
X
ఓ వైరాలజిస్ట్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ గా మారాయి. కరోనా వైరస్ మొదటిసారిగా చైనాలో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే , చైనా కరోనా విషయం లో ఇతర దేశాలని అలర్ట్ చేయలేకపోయింది అని , చైనా కావాలనే చేసింది అని, ఇది ముమ్మాటికీ చైనాకి తెలిసే జరిగింది అని కొందరు చైనా పై విమర్శలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్ ..చైనా వైరస్ అంటూ వారిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే , అప్పుడు దాన్ని చైనా కొట్టిపారేసింది. తమకేమి తెలియదని చెప్పుకొచ్చింది. అయితే , తాజాగా డా.లీ-మెంగ్ యాన్ అనే వైరాలజిస్ట్ వ్యాఖ్యలని బట్టి చూస్తుంటే .. ఇది కచ్చితంగా చైనా కావాలని చేసిన పనే అని అనిపించకమానదు. ఎందుకు అంటే ఈ వైరస్ విజృంభణ మొదలైంది అని చెప్పినా కూడా చైనా అధికారులు ఎవరు పట్టించుకోకుండా ప్రపంచం మొత్తం ఈ వైరస్ వ్యాప్తి చెందటానికి కారణమైయ్యారు. ఒకరకంగా ఈ వైరాలజిస్ట్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ..ట్రంప్ కామెంట్స్ చేసినట్టు కరోనా వైరస్ కాదు చైనా వైరస్ అని చెప్పాల్సిందే.

ఇంతకీ ఈ వైరాలజిస్ట్ ఎవరు ..ఆమె చెప్పింది అంటే .. హాంకాంగ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లో వైరాలజీ, ఇమ్యునాలజీలో స్పెషలైజ్ చేసిన డా.లీ-మెంగ్ యాన్ అనే వైరాలజిస్ట్ ..తాజాగా ఫాక్స్ న్యూస్ కి సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ ... ఈ వైరస్ ఔట్ బ్రేక్ పై తను చేసిన రీసెర్చ్ ని కొందరు ఉన్నత స్థాయి నిపుణులే నిర్లక్ష్యం చేశారని , వైరస్ గురించి బీజింగ్ నాయకత్వానికి ముందే తెలుసు.. నా పరిశోధనలు చివరికి కరోనా వివరాలు బయటి ప్రపంచానికి తెలిసేందుకు దోహదం చేశాయి అని లీ మెంగ్ యాన్ తెలిపింది. తన రీసెర్చ్ అనేకమందిని రక్షించి ఉండవచ్చునని, కానీ కొందరి కారణంగా అలా జరగలేదని ఆమె తెలిపింది. తన పరిశోధనా ఫలితాలను ప్రపంచానికి తెలియజేసేందుకు ప్రాణాలకు తెగించి అమెరికాకు పారిపోయి వచ్చానని , హాంకాంగ్ కి మళ్లీ తిరిగి రాలేనని కూడా భయపడ్డానని చెప్పింది.

ఇన్ ఫ్లూయెంజా వైరస్ లు, పాండమిక్స్ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థకు ‘రెఫరెన్స్ ల్యాబ్’ గా స్పెషాలిటీని కలిగిఉన్న చైనాకు ఈ విషయాన్ని తెలియజేయాల్సిన బాధ్యత ఉందని, అదే సమయంలో ఆ సంస్థను నేను అలర్ట్ చేయాలనీ చూసినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేదు అని, వారు ఎలాంటి చర్యా తీసుకోలేదని లీ-మెంగ్ యాన్ విమర్శించింది. అసలు ఈ వైరస్ గురించి స్టడీ చేసింది మొదట నేనే దాన్నే ఆ తరువాత కోవిడ్-19 గా వ్యవహరించారు.. అని ఆమె స్పష్టంగా తెలియజేసింది. గత డిసెంబరులోనే యూనివర్సిటీ లోని తమ సూపర్ వైజర్ డా.లియో పూన్.. చైనాలో సార్స్ వంటి కేసులున్నాయా అని ప్రశ్నించారట కాగా- హాంకాంగ్ తో బాటు అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని రప్పించేందుకు చైనా ప్రభుత్వం నిరాకరించిందని, ఇక్కడే రీసెర్చ్ జరగాలని కోరిందని ఆమె తెలిపింది.

మనుషుల నుంచి మనుషులకు వ్యాపించే ఈ వైరస్ గురించి డిసెంబరు 31 న నా ఫ్రెండ్ నాకు స్పష్టంగా చెప్పింది అని . అదే రోజున 27 న్యుమోనియా క్లస్టర్ కేసులు వూహాన్ లో బయటపడ్డాయి అని, తన స్నేహితురాలు చెప్పిన విషయాన్నీ, తన తదనంతర పరిశోధనా ఫలితాలను సీనియర్ నిపుణుడికి తెలియజేయగా.. నీ రీసెర్చ్ నువ్వు చూసుకో అని దురుసుగా మాట్లాడాడని తెలిపింది. ప్రస్తుతం దాదాపు అజ్ఞాతంలో ఉన్న లీ.. తనకు ప్రాణహాని ఉందని భయపడుతోంది. తనపై సైబర్ దాడులు జరగవచ్చునన్న ఆందోళనను వ్యక్తం చేసింది. తన కుటుంబ సభ్యులకు కూడా హాని తలపెట్టవచ్ఛు అని కూడా అనుమానం వ్యక్తం చేసింది. కాగా-హాంకాంగ్ యూనివర్సిటీ తమ వెబ్ సైట్ పేజ్ లో… లీ-మెంగ్ యాన్ పేరును తొలగిస్తూ.. ఆమె తమ స్టాఫ్ సభ్యురాలు కాదని తెలిపింది. ఏదేమైనా కూడా ఇప్పుడు ఈ వైరాలజిస్ట్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశాలుగా మారాయి.