Begin typing your search above and press return to search.

నేపాల్ పై కన్నేసిన చైనా.. మరో దుస్సాహాసం

By:  Tupaki Desk   |   25 Oct 2020 7:30 AM GMT
నేపాల్ పై కన్నేసిన చైనా.. మరో దుస్సాహాసం
X
ప్రపంచంపైకి కరోనాను ఎగదోసి చోద్యం చూస్తున్న చైనా ఇప్పుడు పక్కదేశాలపైకి దండెత్తుతోంది. విస్తరణ వాదంతో ఇప్పటికే భారత్ తో కయ్యానికి కాలుదువ్విన చైనా ఇప్పుడు మరో దేశంపైకి దుముకుతోంది.

దుందుడుకు చర్యలతో చైనా తాజాగా నేపాల్ భూభాగాన్ని ఆక్రమించుకుంది. ఏడు సరిహద్దు జిల్లాల్లో గల ప్రాంతాలను ఆక్రమించింది. దీంతో భారత నిఘా విభాగం భారత ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది.

చైనా వేగంగా భూమిని ఆక్రమించుకుంటూ వస్తోందని ఐబీ తెలిపింది. చైనాతో నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ సన్నిహితంగా ఉంటోంది. దీంతో ఇదే అదునుగా చైనా ఆ దేశాన్ని ఆక్రమించే పన్నాగం పన్నుతోందని భారత ఐబీ కేంద్రానికి నివేదించింది.

డొలాకా, గోర్కా, దార్చులా , హుమ్లా, సింధూపాల్ చౌక్, శంఖువసబా, రసువా జిల్లాల్లో చైనా పాగా వేసింది. ఇకతా డొలాకా జిల్లాలో అయితే అంతర్జాతీయ సరిహద్దు 1500 మీటర్లు దాటి చైనా ముందుకొచ్చింది.

నిజానికి ఈ భూభాగాలు నేపాల్ లోనే ఉన్నాయి.అక్కడి వారు నేపాల్ ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నారు. అయితే 2017లో ఈ ప్రాంతాన్ని చైనా ఆక్రమించి టిబెట్ లో విలీనం చేసింది. నేపాల్ లో ఉండే చాలా ఇళ్లను చైనా స్వాధీనం చేసుకుంది.

చైనా ఇదే క్రమంలో భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చే ప్రమాదం ఉందని..అందుకే భారత్ అలెర్ట్ గా ఉండాలని ఐబీ కేంద్రాన్ని హెచ్చరించింది.