Begin typing your search above and press return to search.

రూటు మార్చిన డ్రాగన్

By:  Tupaki Desk   |   1 Aug 2021 5:00 AM GMT
రూటు మార్చిన డ్రాగన్
X
సరిహద్దుల్లో వరుస దెబ్బలు తింటున్న డ్రాగన్ తన రూటును మార్చింది. టిబెటన్లను బలవంతంగా తమ సైన్యంలో చేర్చకుంటోంది. భారత్ సరిహద్దుల్లో అంటే హిమాలయ పర్వతాల్లో కాపలా కాయటం చైనా సైన్యం వల్ల కావటంలేదు. మొండిగా దాదాపు లక్షమంది సైన్యాన్ని జమ్మూ-కాశ్మీర్ సరిహద్దుల్లోని లడ్డాఖ్ లోయతో పాటు పర్వతాల్లోని కొన్ని పాయింట్లపై తన సైన్యాన్ని మోహరించింది. అయితే దానికి భారీ మూల్యాన్ని చెల్లించుకున్నది. మైనస్ 40 డిగ్రీల చలిలో ఉండటం అలవాటు లేని డ్రాగన్ సైన్యం వాతావరణం దాటికి అల్లాడిపోయింది.

సరిహద్దుల్లో కాపలాకాస్తున్న వేలాదిమంది సైనికులు తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు. దాంతో ఏమి చేయాలో దిక్కుతోచక సైనికులను రొటేషన్ పద్దతిలో కాపలాకు నియమిస్తోంది. ఎంత రొటేషన్ పద్దతిని అవలంభిస్తున్నా హిమాలయాల్లోని భిన్నమైన వాతావరణానికి సైనికులు అలవాటు పడలేక నానా అవస్తలు పడుతున్నారు. ఇదే సమయంలో బారత్ సైన్యం మాత్రం కేవలం 50 వేలమంది సైన్యాన్నే లోయల్లోను, పర్వతాల్లోను హ్యాపీగా కాపలా ఉంచిన విషయం గమనించింది.

దాంతో తమ సైన్యానికి, భారత్ సైన్యానికి ఉన్న ప్రధానమైన తేడాను చైనా సైన్యాధికారులు గుర్తించారు. ఇంతకీ అదేమిటంటే టిబెట్ సైనికులే భారత్ ను ఆదుకుంటున్నట్లు చైనాకు అర్ధమైపోయింది. అదెలాగంటే హిమాలయాల అంచునే టిబెట్ ఉన్నది. టిబెట్ లోని వేలాదిమంది యువకులు భారత్ ఆర్మీలో పనిచేస్తున్నారు. అంటే వాళ్ళకు పుట్టుకతోనే మైనస్ డిగ్రీల చలిని తట్టుకోవటం అలవాటైపోయింది.

కాబట్టి మన సైన్యాధికారులు కూడా టిబెట్ యువకులను పర్వతాలు, లోయల్లో కాపలాకు ఉపయోగించుకుంటున్నారు. దాంతో మనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావటంలేదు. ఇదే విషయమాన్ని గ్రహించిన డ్రాగన్ పాలకులు ఇపుడు వాళ్ళు కూడా టిబెట్ యువతను తమ సైన్యంలో చేరాలని నిర్భందిస్తున్నారు. తమ ఆధీనంలో ఉన్న టిబెట్ స్వయంప్రతిపత్తి ప్రాంతంలోని యువకులను నిర్భందంగా సైన్యంలో చేర్చుకుంటోంది.

ప్రతి ఇంటినుండి ఒకళ్ళు కచ్చితంగా సైన్యంలో చేరాల్సిందే అని ఒత్తిడి పెడుతోంది. ఇప్పటికే వేలాదిమంది యువకులను బలవంతంగా సైన్యంలో చేర్చుకుని వాళ్ళందరికీ సైనిక శిక్షణ కూడా ఇప్పిస్తోంది. ఒకసారి సైనికశిక్షణ పూర్తయితే వారందరినీ భారత్ సైనికులకు పోటీగా సరిహద్దులో కాపలాకు ఉపయోగించాలనేది చైనా ప్లాన్. ఇక్కడ ఓ విషయం గమనించాలి.

ఇష్టంలేకపోయినా తమను సైన్యంలో చేర్చుకుంటున్న కారణంగా టిబెటన్లు మనస్పూర్తిగా పనిచేస్తారా అన్నదే పాయింట్. ఎందుకంటే వాళ్ళంతా చైనాతో కన్నా భారత్ తో కలవటానికే ఇష్టపడుతున్నారు కాబట్టి. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.