Begin typing your search above and press return to search.

న్యూయార్క్ టైమ్స్ కు చైనా బ్యాట్ వుమెన్ అరుదైన ఇంటర్వ్యూ

By:  Tupaki Desk   |   15 Jun 2021 1:30 PM GMT
న్యూయార్క్ టైమ్స్ కు చైనా బ్యాట్ వుమెన్ అరుదైన ఇంటర్వ్యూ
X
అనుకోని పరిణామం ఒకటి చోటు చేసుకుంది. అంచనాలకు భిన్నంగా.. ప్రపంచంలోని ప్రఖ్యాత మీడియా సంస్థలన్ని కిందా మీదా పడుతూ.. చైనా బ్యాట్ వుమెన్ షీ ఝెంగ్లీ ఇంటర్వ్యూ కోసం విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. ఎవరెంతగా అడిగినా నోరు విప్పేందుకు ససేమిరా అనే ఆమె అమెరికాలోని ప్రఖ్యాత మీడియా సంస్థ న్యూయార్క్ టైమ్స్ కు అరుదైన ఇంటర్వ్యూ ఇచ్చారు. కరోనా వైరస్ తో చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచే లీక్ అయ్యిందన్న వాదనకు ప్రపంచమంతా ఇప్పుడిప్పుడే నమ్ముతున్న వేళలో.. ఆమె నోరు విప్పారు.

ల్యాబ్ నుంచి వైరస్ లీక్ అయ్యిందన్న మాటను ఇప్పుడిప్పుడే ప్రపంచం మొత్తం నమ్ముతున్నవేళ.. ఆమె మాత్రం అందుకు భిన్నంగా వ్యాఖ్యానిస్తున్నారు. ల్యాబ్ నుంచి వైరస్ లీకైందన్న సిద్దాంతాన్ని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. కరోనా విపత్తుకు తమ సంస్థ ఎంతమాత్రం కాదన్నారు. ఈ సందర్భంగా ఆమె తన అసహనాన్ని వ్యక్తం చేయటం గమనార్హం.

ఏ మాత్రం సాక్ష్యం లేని దానికి రుజువులు తీసుకురావాలంటే.. తాను మాత్రం ఎక్కడి నుంచి తీసుకు వస్తానని ఎదురు ప్రశ్నను సంధించింది. అమాయకమైన శాస్త్రవేత్తలపై ప్రపంచం ఎలా దుమ్మెత్తి పోస్తుందన్న విస్మయాన్ని వ్యక్తంచేశారు. వైరస్ సామర్థ్యాన్ని పెంచే గెయిన్ ఆఫ్ ఫంక్షన్ లాంటివికావని.. వైరస్ మరింత ప్రమాదకరంగా మార్చే ప్రయోగాల్ని తాము చేయలేదని స్పష్టం చేశారు. వైరస్ ను మరింత ప్రమాదకరంగా చేసే ప్రయగాల్ని తాము చేయలేదన్నారు. వైరస్ కారకాలు ఒక వైరస్ నుంచి మరొకరికి ఎలా వ్యాపిస్తాయన్న విషయాన్ని తెలుసుకునేందుకే ప్రయోగాల్నినిర్వహించినట్లు చెప్పారు.

2019 నవంబరుకు ముందు వూహాన్ ల్యాబ్ లోని కొందరు సైంటిస్టులు దగ్గర్లోని కొండ వద్దకు వెళ్లి శాంపిల్స సేకరించారన్న వార్తల్లో నిజం లేదని.. నిజంగానే మీ వద్ద వివరాలుఉంటే.. మిస్ అయిన జర్నలిస్టుల పేర్లను బయటపెట్టాలని కోరారు. కరోనా మూలాలపై దర్యాప్తులో ప్రపంచ ఆరోగ్య సంసథ సైతం తమకు సాయం చేసిందన్నారు. తమపై ఉన్న అపనమ్మకాల వల్లే పుకార్లను నమ్మి తమ వైపు వేలెత్తి చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తాము ఎలాంటి తప్పు చేయలేదని..అనవసరంగా టర్గెట్ చేసి ప్రజల్నికన్ఫ్యూజ్ చేస్తున్నారన్నారు. ఇంతకీ ఈ బ్యాట్ విమెన్ ఎవరు? ఎందుకు ఆ పేరు వచ్చిందన్న విషయంలోకి వెళితే.. ఆమె చైనాలో ఆమె సీనియర్ వైరాలజిస్టు. గబ్బిలాలపై ప్రమాదకర పరిశోధనలు చేస్తున్న నేపథ్యంలో ఆమెకు బ్యాట్ వుమెన్ అని ప్రస్తావిస్తుంటారు. 2011లో ఆమె ఒక గుహను సందర్శించి..అక్కడ గబ్బిలాల్లో సార్స్ తరహా కరోనా వైరస్ ను గుర్తించారు. దీంతో ఆమె పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగింది. అలాంటి ఆమె.. తాజాగా తమ దేశంపై ఇతర దేశాల వైరస్ దాడిని ఖండిస్తూ తానేం అనుకుంటున్న విషయాన్ని ప్రముఖ మీడియా సంస్థను ఎంపిక చేసుకొని ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.