తెలంగాణలో సొంత జాగా ఉంటే 3 లక్షలతో ఇళ్లు.. కేసీఆర్ కొత్త స్కీం...

Wed Jan 25 2023 05:00:01 GMT+0530 (India Standard Time)

Chief Minister KCR New Scheme For Own House

2023 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ కొత్త కొత్త వ్యూహాలు రచిస్తోంది.  జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టినా సొంత రాష్ట్రం ప్రజల కోసం ఈ ఎన్నికల్లో ఏదో ఒకటి చేయాలని భావిస్తోంది. తాజాగా రూ.3 లక్షల స్కీం ను తెరపైకి తేనుంది. సొంత జాగా ఉన్న వాళ్లు ఇళ్లు కట్టుకునేందుకు రూ. 3 లక్షల సాయం చేయాలని కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. దీనినీ 2023 బడ్జెట్ లోనే ప్రతిపాదించి భారీగా నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలకు ఇదే ఫైనల్ బడ్జెట్ కాబట్టి జనాన్ని ఆకర్షించేందుకు ఈ స్కీం ప్రయోజనకరంగా ఉంటుందని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. అయితే 2018లోనే దీనిని తెరపైకి తీసుకొచ్చారు. కానీ ఇప్పటి వరకు నిధులు కేటాయించలేదు.  ఇప్పుడు కేసీఆర్ చేసే ప్రకటనపై ప్రజల నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి చర్చ సాగుతోంది.2014లో మొదటిసారి అధికారంలో వచ్చిన కారు ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది. ఈ లెక్క ప్రకారం 45 లక్షల కుటుంబాలు సింగిల్ రూంలోనే 24 లక్షల కుటుంబాలు అద్దె ఇంట్లో ఉంటున్నట్లు వెల్లడైంది. ఇక 3 లక్షల మంది తాత్కాలిక నివాసాలు ఏర్పరుచుకున్నట్లు తేలింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కుటుంబాల సంఖ్య పెరిగే ఉంటుంది. ఆ అంచనా ప్రకారంగా ఎన్ని నిధులు కేటాయించాలి..? అనే సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

సొంత జాగా ఉన్న ప్రతి ఒక్కరికి రూ.3 లక్షలు సాయం చేస్తున్నట్లు ప్రకటించే అవకాశం ఉంది. అలాగయితే ఎక్కువ శాతం ధనవంతుల వద్దే జాగలు ఉన్నాయి. దీంతో ఏ ప్రాతిపదికన కేటాయిస్తారు..? అనేది కీలకంగా మారింది. ఇప్పటికే రైతు బంధు అందరికీ వర్తింపజేయడంతో ఎకరాలకొద్దీ భూములు ఉన్నవారికే లబ్ధి చేకూరుతుంది. 5 ఎకరాలలోపు వారికి మాత్రమే వర్తింపజేయాలని కొందరు కోరుతున్నారు. ఈ విమర్శలను బేస్ చేసుకొని ఇప్పుడు రూ.3 లక్షల సాయం కూడా సామాన్యులకు ఫలితాలు దక్కేలా ప్లాన్ చేయాలని సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది.

వచ్చే బడ్జెట్ లోగా దీనిపై విధి విధానాలు రూపొందించి ఆ సమావేశాల్లోనే ఈ పథకం ప్రకటించనున్నారు. నియోజకవర్గానికి ఎన్ని నిధులు కేటాయించాలి..? ఎంత మందికి ఇవ్వాలి..? అనే విషయాలను కూడా కేసీఆర్ బడ్జెట్ సమావేశాల్లో వివరించే అవకాశం ఉంది.

అయితే గతంలో ఈ స్కీంను ప్రవేశపెట్టినా ఏ బడ్జెట్ సమావేశాల్లోనూ దీని ప్రస్తావన రాలేదు. కానీ ఇప్పుడు ఎన్నికలను బేస్ చేసుకొని కచ్చితంగా ఈ బడ్జెట్లో దానిని ప్రవేశపెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఈ స్కీం ద్వారా మిడిల్ క్లాస్ వారంతా కేసీఆర్ కే పక్షాన చేరుతాని భావిస్తున్నారు.

దీనిని తెలంగాణలోనే కాకుండా జాతీయ రాజకీయాల్లోనూ ఉపయోగించుకోనున్నారు. అందుకోసం ముందుగా తెలంగాణలో ఈ పథకానికి భారీగా నిధులు కేటాయించి ఆయా నియోజకవర్గాల్లో రూ.3 లక్షల చొప్పున సాయం చేయనున్నారు. వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు ఉన్నందున అప్పటి వరకు ప్రయోజనం పొందిన వారిని జాతీయ రాజకీయాల్లో చూపించనున్నారు. దీంతో దేశంలోనూ ఈ పథకం ప్రవేశపెడుతామని ప్రచారం చేయనున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.