Begin typing your search above and press return to search.

చెన్నై మూడు హత్యల కేసు : విచారణ లో షాకింగ్ విషయాలు వెల్లడించిన కోడలు !

By:  Tupaki Desk   |   18 Nov 2020 2:51 PM GMT
చెన్నై మూడు హత్యల కేసు : విచారణ లో షాకింగ్ విషయాలు వెల్లడించిన కోడలు !
X
భర్తను, అత్తమామలను దారుణంగా హత్య చేసిన కోడలు పోలీసుల విచారణ లో సంచలన విషయాలని వెల్లడిస్తుంది. కోటీశ్వరుల ఇంట్లో ఒకేసారి ముగ్గురు హత్యకు గురైన కేసులో పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజస్థాన్ కు చెందిన దలీల్ చంద్ , ఆయన భార్య పుష్పాబాయ్ దంపతులు 40 ఏళ్ల క్రితం చెన్నై కి వచ్చేసారు. చెన్నైలోని ఎలిఫెంట్ గేట్ సమీపంలోని వినాయక మిస్రీ స్ట్రీట్ లోని ఆపార్ట్ మెంట్ లో దలీల్ చంద్ నివాసం ఉంటున్నారు. దలీల్ చంద్ కు కుమారుడు సీతల్ కుమార్, పింక్ అనే కుమార్తె ఉన్నారు. దలీల్ చంద్, అతని కొడుకు సీతల్ కలిసి చెన్నైలోని షావుకారు పేటలో ఫైనాన్స్ కంపనీ నిర్వహిస్తున్నారు. సీతల్ కు మహారాష్ట్రలోని పూణేకి చెందిన జయమాల అనే మహిళకు 14 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి 13 ఏళ్లు, 11 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

అయితే ,గత రెండు సంవత్సరాల నుంచి కొడుకు , కోడలు మధ్య వివాదాలు ఎక్కువ అయ్యాయి. భర్త సీతల్ తన కోరికలు తీర్చడానికి సరిపోడని డిసైడ్ అయిన జయమాల తన భర్త, అత్తమామలు వేధింపులకు గురి చేస్తున్నారని పూణే పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. తన భర్త సీతల్ తో విడాకులు తీసుకోవాలని జయమాల కోర్టులో పిటిషన్ దాఖలు చేసి పూణేలోని పుట్టింటికి వెళ్లి ఉంటుంది.తాను తన పిల్లలు బతకడానికి రూ. 7 కోట్లు భరణంగా ఇవ్వాలని ఆమె కోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉంది. అయితే , విడాకులు ఇచ్చినా భరణం అంత ఇవ్వలేము అని చెప్పారు. దీనితో గత రెండు నెలల కిందట జయమాల, ఆమె తమ్ముడు కైలాష్, జయమాలతో సన్నిహితంగా ఉంటున్న ఓ యువకుడు, అతని గ్యాంగ్ చెన్నై వెళ్లి మర్యాదగా మాకు ఆస్తిలో భాగం పెట్టాలని, లేదంటే చంపేస్తామని బెదిరించారు. దానితో వారు చెన్నైలోని ఎలిఫెంట్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చెయ్యడంతో కోడలు జయమాల, ఆమె సోదరుడు కైలాష్ తో పాటు ఆమె కుటుంబ సభ్యుల మీద కేసు నమోదైయ్యింది.

ఇక ,అప్పటి నుంచి సీతల్, జయమాల దంపతుల మద్య ఆస్తి పంపకాల విషయంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని పంచాయితిలు జరిగినా పెద్దగా ప్రయోజనం లేదు. ఇక ఈ నెల 12 న ఆస్తి కోసం చాలా సేపు గొడవ పడిన జయమాల తరువాత తన వెంట వచ్చిన వారి సహాయంతో భర్త సీతల్, మామ దలీల్ చంద్, అత్త పుష్పాబాయ్ ను కుర్చీలకు కట్టేసి రివాల్వర్ తీసుకుని వారి నుదిటి మీద కాల్చి చంపేసిన విషయం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యిందని పోలీసులు గుర్తించారు. విమానంలో పూణే వెళ్లిన చెన్నై పోలీసులు జయమాల ఇంటికి చేరుకున్నారు. అప్పటికే చెన్నై సిటీ పోలీసులు పూణే వచ్చారని తెలుసుకున్న జయమాల, మరో ముగ్గురు నిందితులు కారులో సోలాపూర్ కు పారిపోవడానికి ప్రయత్నించారు. సోలాపూర్ మార్గంలో వెంటాడిన చెన్నై పోలీసులు చివరికి శనివారం వేకువ జామున జయమాల, ఆమె సోదరుడు కైలాష్ తో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసి విచారణ ప్రారంభించగా ఒక్కొక్కటిగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాను ఎన్నిసార్లు చెప్పినా నా భర్త నా మట వినలేదు. భార్యను సుఖపెట్టలేని తెలివితేటలు లేని భర్తకు చెప్పిచెప్పి నేను విసిగిపోయాను. తన అత్త తనను టార్చర్ పెట్టిందని జయమాల పోలీసులకు చెప్పింది. నా జీవితానికి ఒకదారి చూపించకుండా చులకన చేశారు. నేను వయసులో ఉన్నాను, 13, 11 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, నాకు ఏమీ కోరికలు ఉండవా అంటే తన భర్త, అత్తమామలు నీచంగా మాట్లాడారు .అందుకే సహనం కోల్పోయి ఆ ముగ్గురిని చంపేయాలని తాము డిసైడ్ అయ్యామని కోడలు చెప్పింది. అలాగే తన అక్క సంతోషం కోసమే హత్య చేసానని కైలాష్ చెప్పాడు.