Begin typing your search above and press return to search.

ఈ మందుతో 48 గంటలలో కరోనాకు చెక్ పెట్టొచ్చట !

By:  Tupaki Desk   |   11 Aug 2020 10:50 AM GMT
ఈ  మందుతో 48 గంటలలో కరోనాకు చెక్ పెట్టొచ్చట !
X
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి శరవేగంగా విస్తరిస్తుంది. ఇప్పటికే కరోనా వైరస్ ను కట్టడిలోకి తీసుకురావడానికి అనేక దేశాలు వ్యాక్సిన్ కోసం తీవ్రంగా శ్రమిసున్నాయి. ప్రస్తుతం ఒకవైపు భయంతోనే .. కరోనాకి సరైన వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇకపోతే , ఇప్పటికే ఆగస్ట్ 12 న వ్యాక్సిన్ రిలీజ్ చేయబోతున్నట్టు రష్యా అధికారికంగా ప్రకటించింది. అయితే , రష్యా విడుదల చేయబోయే వ్యాక్సిన్ పై పలు దేశాలు అనుమానం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇక, అమెరికా, బ్రిటన్ దేశాలు తయారు చేస్తున్న వాక్సిన్ లు అందుబాటులోకి రావాలంటే ఈ ఏడాది చివరి వరకు ఆగాల్సిందే. భారత్ బయోటెక్ తయారుచేస్తున్న వ్యాక్సిన్ కూడా త్వరలోనే విడుదల కాబోతుంది. మూడో దశ హ్యూమన్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఈ సమయంలో ఆస్ట్రేలియాకు చెందిన సెంటర్ ఫర్ డైజెస్టివ్ డిసీజ్ ఓ ఔషధాన్ని సూచించింది. దానిపేరు ఐవర్ మెక్టిన్. ఈ మెడిసిన్ తీసుకున్న 48 గంటల్లోనే కరోనా వైరస్ ను పూర్తిగా చంపేస్తుందని సెంటర్ ఫర్ డైజెస్టివ్ డిసీజ్ మెడికల్ డైరెక్టర్ ప్రొఫెసర్ థామస్ బోరోడి తెలిపారు. ఈ మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ ఆధారంగా మాత్రమే దొరుకుతుందని, దీనిని ఒంటరిగా కాకుండా, డాక్సి సైక్లిన్, జింక్ వంటి మరో రెండింటిని జోడించి వాడాలని అన్నారు. ఒక్కో మెడిసిన్ డోస్ 48 గంటల్లోనే వైరస్ ను నాశనం చేస్తుందని, 24 గంటల్లో వైరస్ తగ్గుముఖం పడుతుందని బోరోడి వెల్లడించారు. ఇప్పటికే, బాంగ్లాదేశ్ చైనాలో దీనిని వినియోగిస్తున్నట్టు తెలిపారు. ఐవర్ మెక్టిన్ టాబ్లెట్ ధర రెండు డాలర్ల కంటే తక్కువగా ఉంటుందని ఫలితం మాత్రం ఎక్కువగా ఉంటుందని బోరోడి తెలిపారు.