Begin typing your search above and press return to search.

శతాబ్దాల సంప్రదాయాన్ని పక్కన పెట్టేసేందుకు చార్లెస్ 3 రెఢీ

By:  Tupaki Desk   |   23 Jan 2023 2:30 PM GMT
శతాబ్దాల సంప్రదాయాన్ని పక్కన పెట్టేసేందుకు చార్లెస్ 3 రెఢీ
X
క్వీన్ ఎలిజిబెత్ మరణం నేపథ్యంలో బ్రిటన్ రాజుగా కింగ్ ఛార్లెస్ 3ను అధికారిక లాంఛనాలతో పట్టాభిషేకం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే ఆరున జరిగేకార్యక్రమం కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు సాగుతున్నాయి.

అయితే.. ఈ సందర్భంగా కింగ్ ఛార్లెస్ 3 అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నట్లుగాచెబుతున్నారు. వందల ఏళ్లుగా వస్తున్న సంప్రదాయానికి ఆయన స్వస్తి పలికి.. కొత్త విధానానికి తెర తీయాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.

పట్టాభిషేక సమయంలో రాజు కానీ రాణి కానీ పట్టువస్త్రాలను ధరిస్తుంటారు. అందుకు భిన్నంగా వ్యవహరించాలని కింగ్ ఛార్లెస్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.

రాజుగా ధరించాల్సిన పట్టు వస్త్రాలు కాకుండా సైనిక యూనిఫారంలో పట్టాభిషేకానికి హాజరుకావాలన్న తన ఆలోచనను సన్నిహితుల వద్ద కింగ్ ఛార్లెస్ ప్రస్తావించినట్లుగా ఒక ప్రముఖ మీడియా సంస్థ పేర్కొంది.

తన ఆలోచనను సీనియర్ సలహాదారులకు చెప్పారని.. సంప్రదాయ దుస్తులు కాలం చెల్లినవిగా కింగ్ ఛార్లెస్ 3 భావిస్తున్నారని.. అందుకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారనిచెబుతున్నారు.

దాదాపు ఏడు దశాబ్దాలకు పైనే బ్రిటన్ ను పాలించిన క్వీన్ ఎలిజిబెత్ 2 గత సెప్టెంబరులో మరణించటం.. ఆమె స్థానంలో కింగ్ ఛార్లెస్ 3కు పట్టాభిషేకం చేస్తుండటం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాధినేతలు.. ప్రముఖులతో పాటు వేలాది మంది సామాన్య ప్రజానీకాన్ని కూడా ఈ వేడుకకు హాజరయ్యేలా ఏర్పాట్లు సాగుతున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.