Begin typing your search above and press return to search.

ఆఫీసుల్లో ఛార్జింగ్ పెట్టుకోవడం.. దొంగతనంతో సమానం.. ఎందుకంటే?

By:  Tupaki Desk   |   27 Nov 2021 11:30 PM GMT
ఆఫీసుల్లో ఛార్జింగ్ పెట్టుకోవడం.. దొంగతనంతో సమానం.. ఎందుకంటే?
X
సాంకేతికత కొత్తపుంతలు తొక్కుతున్న నేపథ్యంలో పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతీ ఒక్కరి దగ్గర సెల్ ఫోన్ న్ తప్పనిసరి అయ్యింది. ఇది లేకుండా చిన్న పిల్లలు అయితే నిద్రపోరు.. పెద్దవాళ్లకు అయితే పూటగడవదు. ఉద్యోగం చేసే వారికి అయితే ఈ ఫోన్ అనేది లేకుండా బయటకు కదలరు. ఫోన్ తోనే ఎక్కువ కాలం గడిపేందుకు చాలా మంది మొగ్గు చూపిస్తున్నారు. అందుకే రాత్రి పూట ఎక్కువ సమయం అందులో నిమజ్ఞమైపోయి.. తెల్లవారిన తరువాత హాయిగా నిద్రలేచి ఛార్జింగ్ పెట్టుకుంటారు. ఉద్యోగం చేసే వారు అయితే ఆఫీసులో పెట్టుకోవచ్చు అనే భావనలో నిద్రలేచాక కూడా.. పెట్టుకోకుండా ఉంటాం. అయితే అలాంటి వారికి ఓ బాస్ ఝలక్ ఇచ్చారు.

ఆఫీసుల్లో ఛార్జింగ్ పెట్టుకోవడాన్ని తప్పు పట్టారు. పని చేసే ప్రదేశాల్లో అలా ఎలా ఛార్జింగ్ పెట్టుకుంటారని ఉద్యోగులను నిలదీశారు. ఇంతటితో ఆగకుండా.. పని చేసే ప్రదేశాల్లో ఫోన్కు ఛార్జింగ్ పెట్టడం అనేది విద్యుత్ దొంగలించడం అని అన్నారు. ఈ చర్య ఉద్యోగులు పనితనానికి, వారి నైతిక విలువలుకు నిదర్శనం అని ఓ పేపర్ మీద రాసి అంటించారు. ఆ బాస్ పేరు.. ఆఫీస్ అడ్రస్ తెలియదు కానీ.. అతను రాసి అంటించిన పేపర్ మాత్రం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. ఓ వెబ్ సైట్ లో దీనిపై ఏకంగా గంటల కొద్దీ చర్చ నడిచింది. తప్పు అని కొందరు అంటే.. మరి కొందరు పని చేసే దగ్గర ఆమాత్రం చనువు ఉండాలని అంటున్నారు. ఈ చర్చలో మరో ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. బాస్ నిర్ణయానికి మద్దతు తెలిపే వారు బాస్, టీం లీడర్ మైండ్ తో ఆలోచిస్తున్నారని.. ఆ ఆలోచనలు నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉందని కామెంట్ చేశారు. ఈ కామెంట్ కు మాత్రం.. అదిరి పోయే స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఎక్కుమంది ఉద్యోగులు ఉండడంతో ఉద్యోగిలా ఆలోచించే వారు ఆ వ్యక్తి చేసిన కామెంట్ కు లైకుల వర్షం కురిపించారు.

మరికొందరు ఉద్యోగులు వాదన మరోలా ఉంది. ఆఫీసుల్లో ఎక్కువ సమయం గడుపుతున్నాం కాబట్టి చార్జింగ్ పెట్టుకోవడంలో తప్పు ఏంటి అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇలా ఆలోచిస్తేనే బాస్ కంపెనీని ఉన్నత స్థానంలో పెట్టగలరని కామెంట్లు చేస్తున్నారు. మరో బృందం మాత్రం బాస్ చెప్పేది వినాలని అంటున్నారు. పని చేసే సంస్థ పట్ల అంకిత భావం ఉండాలని చెప్తున్నారు. దీని వల్ల ఆఫీసుల్లో పని ఎక్కువగా చేస్తారని అన్నారు. ఫోన్ ను తరుచూ వాడడం వల్ల ఆఫీస్ లో మైండ్ పక్కదారి పడుతుందని అభిప్రాయ పడుతున్నారు.

ఇదిలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా చాలా కంపెనీలు ఇప్పటికే ఆఫీసుల్లో ఫోన్ వాడకాన్ని రద్దు చేశాయి. ఛార్జింగ్ పేరుతో చాలా మంది ఆఫీసుకు సంబంధించిన డేటాను బయటకు లీక్ చేస్తున్నారని అనేక మంది నిపుణులు ఇప్పటికే చెప్పారు. ఇలాంటి సందర్భాలు కూడా లేకపోలేదు.