Begin typing your search above and press return to search.

డాక్టర్ కే చుక్కలు: ఒకరోజు కరోనా చికిత్సకు రూ.1.15 లక్షలు వసూలు

By:  Tupaki Desk   |   6 July 2020 4:15 AM GMT
డాక్టర్ కే చుక్కలు: ఒకరోజు కరోనా చికిత్సకు రూ.1.15 లక్షలు వసూలు
X

కరోనా పేరిట ప్రైవేటు ఆస్పత్రులలో జరుగుతున్న దందాపై ఓ ప్రభుత్వ మహిళా డాక్టర్ వీడియోలో ఆవేదన వ్యక్తం చేసింది. కరోనా చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన ఆమె దగ్గర కూడా ఇన్ని లక్షలు వసూలు చేయడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇదంతా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒక మహిళా వైద్యురాలుకు కరోనా సోకడంతో చికిత్స కోసం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. ఆమెకు ఒకరోజుకు రూ.1.15 లక్షలు వసూలు చేశారని ఆమె వీడియోలో ఆరోపించారు.

హైదరాబాద్ లోని ఫీవర్ హాస్పిటల్‌లో అసిస్టెంట్ సివిల్ సర్జన్ అయిన డాక్టర్ సుల్తానా తన సెల్ఫీ వీడియోలో కూడా బిల్లు చెల్లించనందుకు ఆసుపత్రి సిబ్బంది ఆమెను నిర్బంధించారని పేర్కొంది. తన సోదరుడు, కుమార్తెకు కూడా పాజిటివ్ గా వచ్చిందని వాపోయింది. తన 1.5 నిమిషాల వీడియో అంతటా ఏడుస్తూనే మాట్లాడింది. ఈ వీడియో ఆదివారం వైరల్ అయ్యింది. ‘ఒక రోజుకు ఆస్పత్రి యాజమాన్యం రూ .1.15 లక్షలు వసూలు చేస్తున్నారు. నేను అంత చెల్లించలేకపోయాను. నా సోదరుడు రూ.1.50 లక్షలు చెల్లించాడు. మేము మొత్తం రూ .1.9 లక్షలు ఇప్పటివరకు చెల్లించాం" అని డాక్టర్ చెప్పారు. డబ్బులు చెల్లించనందుకు ఆసుపత్రి యాజమాన్యం తనను నిర్బంధించిందని..డిశ్చార్జ్ చేయడం లేదని ఆమె ఆరోపించారు.

ఇక ఈ వ్యవహారంపై ఆస్పత్రి కూడా స్పందించింది. తాము వైద్యులమేనని.. ఒక వైద్యురాలి పట్ల ఎలా అలా క్రూరంగా ఉంటామని.. బిల్లు చెల్లించనందుకు ఆమెను నిర్బంధించలేదని మజ్లిస్ బచావో తెహ్రీక్ (MBT) నాయకుడు అమ్జేదుల్లా ఖాన్ తాజాగా ఆరోగ్య మంత్రి ఇ. రాజేందర్ ట్వీట్‌లో సమాధానమిచ్చారు. ఇక ఈ వివాదంపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున డాక్టర్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయినట్లు పోలీసులు కనుగొన్నారు.

తెలంగాణలో ప్రైవేటు ఆస్పత్రులు కరోనా చికిత్స పేరిట భారీగా వసూలు చేస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరలను పాటించడం లేదని చాలా మంది కరోనా రోగులు ఫిర్యాదులు చేశారు. అయినా తెలంగాణ ప్రభుత్వం దీనిపై ఇప్పటిదాకా దీనిపై చర్యలు తీసుకోలేదు. ఫీవర్ ఆస్పత్రి డాక్టర్ ఫిర్యాదును తాము గమనించామని, చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.