Begin typing your search above and press return to search.

బాపురే.. ప్రేమ-పెళ్లి-శృంగారంలోనూ మార్పులు తప్పవా?

By:  Tupaki Desk   |   12 July 2020 7:10 AM GMT
బాపురే.. ప్రేమ-పెళ్లి-శృంగారంలోనూ మార్పులు తప్పవా?
X
కాలానికి అనుగుణంగా ప్రేమ-పెళ్లి-శృంగారం మారుతూ వస్తున్నాయి. మన ముందుతరం వాళ్లు ప్రేమలేఖలు రాసుకోవడం.. గ్రీటింగ్ కార్డ్స్ లాంటి ఇచ్చుకొని తమలోని భావాలను తమ ప్రేమికులతో పంచుకునేవారు. తమ పెద్దవాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకోవడం లాంటివి చేసేవారు. పెద్దలకు నచ్చకపోతే వారుచూసిన సంబంధాలను చూసి పెళ్లి చేసుకోవడం లాంటివి చూశాం. అయితే పాతతరం ఒక ఎమెషన్ క్యారీ అయ్యేది. ఆతరంలో ప్రేమ నిజాయితీ ఎక్కువగా ఉండదని చాలామంది నేటికి ఘంటాపథంగా చెబుతుంటారు.

ఇక మనతరానికి వచ్చేసరికి ప్రేమకు టెక్నాలజీ తోడైంది. ఇంటర్నెట్ ప్రేమలు, సెల్ ఫోన్ ఛాటింగులు, పార్కులు, రెస్టారెంట్లు, పబ్బులు, సినిమాలు, షికార్లు, ఐస్ క్రీమ్ పార్లర్లు, షాపింగులుగట్రా చేయాల్సిందే. ప్రేయసిని ఇంప్రెస్ చేయడానికి ప్రియుడు.. ప్రియుడిని ఇంప్రెస్ చేయడాని ప్రేయసి రకరకాలు ప్రయత్నాలు చేస్తుండటం ఈరోజుల్లో కామన్ గా మారింది. ఈకాలంలో చాలాప్రేమలు పెళ్లిళ్ల వరకు రాకుండానే బ్రేకప్ అవుతున్నాయి. యువతీయువకులు ఇష్టపడి కొన్నాళ్లు కలిసి తిరగడం.. కొందరు హద్దులు దాటడం చేస్తూ ఇబ్బందులు పడుతున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. ఈకాలంలో ప్రేమపెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతున్నా.. బ్రేకప్ విషయాల్లోనూ ప్రేమికులే ఎక్కువగా ఉంటుండటం గమనార్హం.

ఇక భవిష్యత్ ప్రేమలు ఎలా ఉంటాయని అందరిలో ఆసక్తిని రేపుతోంది. ఇప్పుడంతా స్మార్ట్ యుగం.. దీనికితోడు కరోనా వచ్చాక పరిస్థితులన్నీ మారిపోయాయి. తోటి మనిషికి చూస్తే భయపడే రోజులు వస్తాయని కలలో కూడా ఊహించి కూడా ఉండరు. అలాంటి పరిస్థితులు నేడు కల్లారా చూస్తున్నాం.. ఇక రానున్న రోజుల్లో పరిస్థితులు ఇంకేలా మారుతాయోననే ఆందోళన నెలకొంది. ఇక ప్రేమ-పెళ్లి-శృంగారం గురించి చెప్పాల్సి వస్తే వర్చువల్ మీటింగ్, డేటింగ్ యాప్స్, ఆన్ లైన్ వీడియోలదే భవిష్యత్ అంతా అనేలా పరిస్థితులు మారిపోతున్నాయి.

నేడు క్యాండిల్ డిన్నర్ల నుంచి గాజుల అద్దాల మధ్య భౌతికదూరం పాటిస్తూ డిన్నర్లు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. రానున్న రోజుల్లో రెస్టారెంట్స్ లాంటివి డేట్ నైట్స్ వంటివి ఏర్పాటు చేయనున్నాయి. లాక్డౌన్ చాలామంది డేటింగ్ యాప్స్, వీడియో చాటింగులు, శృంగార వీడియోలను చూస్తూ కాలక్షేపం చేస్తూ గడిపినట్లు సర్వేలు చెబుతున్నాయి. రానున్న కాలంలోనూ పరిస్థితులు ఇలానే ఉండే అవకాశాలు కన్పిస్తుంది.

ఒంటరిగా ఉండేవారు సెక్స్ బ‌డ్డీలను వాడుకునేందుకు నెదర్లాండ్ ప్రభుత్వం ఇప్పటికే అవకాశం ఇచ్చింది. ఒంటరిగా ఉండేవాళ్లు హ‌స్త ప్ర‌యోగం, ఇత‌రుల‌తో వ‌ర్చువ‌ల్ సెక్స్‌ కే మొగ్గుచూపుతున్నారట. చాలమాంది శృంగార క‌థ‌లు చ‌ద‌వ‌డం, క‌లిసి హ‌స్త ప్ర‌యోగం చేసుకోవ‌డం అలవాటుపడుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. శృంగారం కూడా ఆన్ లైన్లోనే అంటే వింతగా అనిపించినా.. భవిష్యత్తులో ప్రేమ-పెళ్లిళ్లు-శృంగారం స్వరూపమే మారిపోవడం ఖాయంగా కన్పిస్తున్నాయి.