దేశం పేరు మార్చండి.. సంచలనంగా క్రికెటర్ సతీమణి

Mon Aug 15 2022 22:00:02 GMT+0530 (IST)

Change the name of the country The sensational cricketer wife

ఇంతకాలం ఊరు పేరు.. పట్టణం పేరు.. నగరం పేరు.. రాష్ట్రం పేరు మార్చమన్న డిమాండ్ చేశాం. కానీ.. దేశం పేరును మార్చాలన్న డిమాండ్ ను ఒక సెలబ్రిటీ కోరటం మాత్రం ఇదేనని చెప్పాలి. ఇండియా పేరును మార్చాలన్న డిమాండ్ పాతదే అయినా.. దాన్నిఒక సెలబ్రిటీ ప్రస్తావించటం.. సోషల్ మీడియా ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.భారత స్వాతంత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' సంబరాలు అంబరాన్ని అంటుతున్న వేళ.. టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ సతీమణి హసీన్ జహాన్ చేసిన పోస్టు ఒకటి ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

భర్తతో విభేదాల కారనంగా కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్న ఆమె.. దేశం పేరును మార్చాలన్న విన్నపాన్ని ప్రధాని మోడీ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఆమె కోరారు. దీనికి సంబంధించిన ఒక పోస్టును ఇన్ స్టాలో పోస్టు చేశారు. ఇదిప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.

భారతదేశం పేరు ఇండియాగా పలకటం ద్వారా రావాల్సినంత గుర్తింపు రావటం లేదని.. అందుచేత పేరును ఇండియాగా కాకుండా భారత్ లేదా హిందూస్తాన్ లా పిలిచేలా సవరణ చేయాలని.. అప్పుడు దేశం పేరు మరింతగా పాపులర్ అవుతుందని పేర్కొన్నారు.

ప్రస్తుతం వాడుకలో ఉన్న ఇండియా పేరును భారత్.. లేదంటే హిందుస్తాన్ అని పెట్టాలని.. కావాల్సినంత గుర్తింపు లభిస్తుందన్నారు. ఈ పోస్టుతో పాటు.. మరో ఇద్దరితో కలిసి ప్రముఖ బాలీవుడ్ గీతమైన దేశ్ రంగీలా పాటకు ఆమె వేసిన డ్యాన్స్ అందరిని ఆకట్టుకుంటోంది. మొత్తానికి కొంతకాలంగా వార్తల్లో లేకుండా పోయిన షమీ సతీమణి.. తాజా వినతితో మరోసారి పాపులర్ అయ్యారని చెప్పాలి.