Begin typing your search above and press return to search.

కేసీఆర్ జాతీయ పార్టీపై చంద్రబాబు స్పందన చూస్తే షాక్ లగా?

By:  Tupaki Desk   |   5 Oct 2022 8:57 AM GMT
కేసీఆర్ జాతీయ పార్టీపై చంద్రబాబు స్పందన చూస్తే షాక్ లగా?
X
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత్ రాష్ట్ర సమితిగా మారింది. సీఎం కేసీఆర్ ఈ మేరకు తన పార్టీని జాతీయ పార్టీగా మారుస్తూ తీర్మానం చేశారు. కేసీఆర్ జాతీయ పార్టీపై టీఆర్ఎస్ శ్రేణులంతా సంబరాలు చేసుకున్నాయి.

ఇక కొన్ని రాజకీయ పార్టీలు దీన్ని స్వాగతిస్తుండగా.. ప్రతిపక్షాలు మాత్రం కొంత విమర్శలు చేస్తున్నాయి. టీఆర్ఎస్ నేతలు 'దేశ్ కీ నేత'అని కొనియాడుతున్నారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పుతారంటూ ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ జాతీయ పార్టీ గురించి చంద్రబాబు స్పందించారు.

టీఆర్ఎస్ పేరును మారుస్తూ బుధవారం నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తోపాటు 283మంది టీఆర్ఎస్ ప్రతినిధులు ఆ తీర్మానంపై సంతకం చేశారు. దీంతో 21 ఏండ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో మరో మలుపు చోటుచేసుకుంది. సుమారు 8 రాష్ట్రాలకు చెందిన నేతలు కూడా సమావేశానికి హాజరయ్యారు.

జాతీయ స్థాయిలో కేసీఆర్ పార్టీపై చర్చ సాగుతోంది. కేసీఆర్ నేషనల్ పార్టీపై జాతీయ మీడియాలోనూ జోరుగా కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కేసీఆర్ జాతీయ పార్టీపై చంద్రబాబు స్పందించడానికి ఇష్టపడడం లేదు.

దసరా సందర్భంగా.. బెజవాడ కనకదుర్గమ్మను కుటుంబ సమేతంగా చంద్రబాబు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి పట్టువస్త్రాలు సమర్పించారు.

ఈ సందర్భంగా మీడియాతో చంద్రబాబు మాట్లాడారు. కేసీఆర్ జాతీయ పార్టీ గురించి చంద్రబాబును ప్రశ్నించగా.. 'ఆయన ఓ నవ్వు నవ్వి వెళ్లిపోయారు'. కేసీఆర్ జాతీయ పార్టీని ఓ జోక్ గా చంద్రబాబు తన నవ్వుతో అభివర్ణించారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ జాతీయ పార్టీని ఎద్దేవా చేసేలా బాబు రియాక్షన్ ఉందని అర్థమవుతోంది. శిష్యుడి పార్టీని చంద్రబాబు జీర్ణించుకోవడం లేదని తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.