బాబు వేశాడు.. రాసుకోండి కన్నడిగులు

Mon Apr 22 2019 18:00:01 GMT+0530 (IST)

Chandrababu naidu Wants to Learn Kannada Laguage

చంద్రబాబు తన పార్టీ టీడీపీని జాతీయ పార్టీగా అప్పట్లో ప్రకటించారు. తన పార్టీ తెలంగాణ ఏపీ రెండు రాష్ట్రాల్లో ఉందని.. పక్కరాష్ట్రాలు వివిధ దేశాల్లో శాఖలున్నాయని పేర్కొన్నారు. అంతవరకు బాగానే ఉంది.. జాతీయ నాయకుడిగా ఫోకస్ అవుదామని కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్న చంద్రబాబు ఇప్పుడు జాతీయ స్థాయిలో మెజార్టీ రాష్ట్రాల్లో ఉన్న జాతీయ భాష హిందీని మాత్రం ఇంతవరకు నేర్చుకోలేదు. హిందీ బెల్ట్ లో ప్రచారానికి వెళ్లినా.. జాతీయ మీడియాతో మాట్లాడినా కేవలం తనకు వచ్చిన ‘ఇంగ్లీష్’లోనే మాట్లాడుతారు.  ..అందుకే కాబోలు అప్పట్లో కేసీఆర్ .. చంద్రబాబును ఉద్దేశించి ‘ఈయనకు జాతీయ భాష హిందీయే రాదు.. ఢిల్లీలో చక్రం తిప్పే జాతీయ నాయకుడట’ అని ఎద్దేవా చేశారు. అదే సమయంలో కేసీఆర్ బహుభాషా కోవిదుడు. ఆయనకు తెలుగు - హిందీ - ఇంగ్లీష్ తోపాటు ఉర్దూ కూడా వచ్చు. అందుకే ఏ భాషలోనైనా.. ఏ ప్రాంతంలోనైనా కేసీఆర్ ఇరగొట్టేస్తాడు..

తాజాగా కర్ణాటకలో పర్యటించిన చంద్రబాబు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. కన్నడిగులకు కన్నడ - అయితే హిందీ తప్ప మరో భాష తెలీదు. కానీ అక్కడి తెలుగు వారిని ఆకట్టుకోవడానికి కాంగ్రెస్-జేడీఎస్ ప్రచారానికి వెళ్లిన బాబు ఆపసోపాలు పడ్డారు. ఇక తరుచూ వస్తా.. అవసరమైతే కన్నడ నేర్చుకుంటా అని ప్రకటించారు.

నిజానికి చిత్తూరు బార్డర్ కుప్పం నుంచి గెలిచిన బాబుకు శివారులో ఉన్న తమిళం - కన్నడ రావాల్సింది. ఎందుకో ఆయన పట్టు సాధించలేదు.ఇప్పుడు కొత్తగా కన్నడ నేర్చుకుంటానని ప్రతిన బూనారు. అదేదో హిందీ నేర్చుకున్నా పోయేది.. జాతీయ నాయకుడిగా ఎదిగే క్రమంలో బాబుకు ఉపయోగపడేది.. చూస్తుంటే 30 రోజుల్లో కన్నడ పుస్తకం బాబు కొనటట్టే ఉన్నారు. చూడాలి మరి..