Begin typing your search above and press return to search.

నేరానికి-కులానికి లింకు పెడుతున్న బాబు

By:  Tupaki Desk   |   23 Feb 2020 2:30 PM GMT
నేరానికి-కులానికి లింకు పెడుతున్న బాబు
X
పలుమార్లు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా పనిచేసిన అపార అనుభవం చంద్రబాబు నాయుడికి ఉంది. రాజకీయాల్లో 40ఇయర్స్ ఇండస్ట్రీగా గొప్పలు చెప్పుకునే ఆయన చేసే పనులు మాత్రం గల్లీ రాజకీయాలను తలపిస్తుంటాయన్న విమర్శ ఉంది. తనపై వచ్చే అవినీతి మరకలను ఇతరులకు అంటిస్తూ పబ్బం గడపడంలో ముందుంటారు. పక్కా ఆధారాలతో రెడ్ హ్యండెడ్ గా తనకు కావాల్సిన వారు దొరికిపోయినా ఏమాత్రం సంకోచించకుండా వెనుకేసుకురావడం చంద్రబాబునాయుడికే దక్కిందనడంలో ఎలాంటి సందేహం లేదు. తన హయాంలో పనిచేసిన మంత్రుల అవినీతిని ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు బయటపెట్టినా ఆయన కళ్లకు కన్పించకపోవడం శోచనీయం. ఇదంతా ప్రభుత్వం కుట్ర అంటూ ఆరోపణలు చంద్రబాబు నాయుడి చౌకబారు రాజకీయానికి అద్ధం పడుతోంది.

*కుంభకోణంలోనూ కులాన్నే చూస్తున్న బాబుగారూ..

ఏపీలో తాజాగా కార్మిక బీమా సంస్థ(ఈఎస్ఐ) ఆసపత్రుల్లో భారీ కుంభకోణం బయటపడింది. ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు పక్కా ఆధారాలతో 151కోట్ల అవినీతి జరిగిందని తేల్చారు. ఈ అవినీతిలో చంద్రబాబు హయంలో మంత్రులుగా పనిచేసిన అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణ పేర్లు వెలుగులోకి వచ్చారు. ఇంకేముందీ బాబుగారు రంగంలోకి దిగారు. అవినీతి విషయాన్ని పక్కనపెట్టి కులం కార్డును బయటికి తీశారు. అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణలు బీసీలు అయినందువల్లే వైసీపీ ప్రభుత్వం వారిని టార్గెట్ చేసిందని ఆరోపణలు గుప్పించారు. అవినీతి చేసేవాళ్లలోనూ బీసీలు, మరో కులం అంటగట్టి రాజకీయం చేయడం ఒక్క బాబుగారికే సాధ్యమని పలువురు అంటున్నారు.

*ప్రాంతాల్లో చిచ్చుపెడుతున్న వైనం..

చంద్రబాబు నాయుడు ఒక్క కులాన్నే మాత్రమే కాకుండా ప్రాంతాల వారీగా రాజకీయాలను చేస్తున్నారనే విమర్శలున్నాయి. గతంలో కాపు ఉద్యమం జరిగినపుడు పలు ఘర్షణలు జరిగాయి. ఆ సమయంలో కొందరు దుండగులు రైలును తగులబెట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ముందుకొచ్చి ఇది రాయలసీమ నుంచి వచ్చిన గుండాల పనేనంటూ రాజకీయానికి తెరలేపారు. ఆ తర్వాత రాయలసీమ వాసులకు ఎలాంటి సంబంధ లేదని విచారణలో వెల్లడయింది. అయితే ఆయన చేసిన రాజకీయానికి రాయలసీమ వాసులు బలయ్యారు.

ఇటీవల చంద్రబాబు నాయుడు మాజీ పీఏ ఇంట్లో 2వేల కోట్లు దొరికాయన్న ప్రచారం సాగింది. ఒక ప్రభుత్వ ఉద్యోగి దగ్గర ఇంత డబ్బు ఎలా వచ్చిందని ప్రశ్నిస్తే చంద్రబాబునాయుడు కన్నెర్ర చేస్తాడు. మొన్నటిమొన్న ఐజీ ఏబీ వెంకటేశ్వర్ రావు దేశ రాజకీయాలను బహిర్గతం చేసినట్లు నిరూపణ రావడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవీ నుంచి తప్పించింది. ఇందులోనూ ఆయనకు తప్పే కన్పిస్తుంది. అంతేకాకుండా అమరావతిలో కమ్మ కులస్థులు ఎక్కువగా ఉన్నందునే రాజధానిని తరలిస్తున్నారంటూ చౌకబారు ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. ఒక్క కులం వారే రాజధానిలో ఉండాలా? లేనేది చంద్రబాబు నాయుడు ప్రశ్నించుకోవాలి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని పరిపాలన వికేంద్రీకరణ చేపడితే ప్రాంతాల వారీగా, కులాల వారీగా రెచ్చగొట్టడం బాబు గారికే దక్కింది.

రాజకీయాల్లో తనది 40ఇయర్స్ ఇండస్ట్రీ అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబునాయుడు మాత్రం 420లను వెనకేసుకు రావడంలో ముందంజలో నిలుస్తున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. కులాల వారీగా, ప్రాంతాల వారీగా ప్రజల్లో చిచ్చుపెడుతూ రాజకీయాలు చేయడంలో బాబును మించిన నాయకుడు దేశంలో లేడని అంటున్నారు. గురివింద గింజకు తనకింద నలుపు కనబడదు అన్న చందంగా చంద్రబాబు వ్యవహరం ఉందని విజయసాయిరెడ్డి లాంటి వారు హాట్ కామెంట్స్ చేస్తున్నారు.. ఆయన చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొడుతున్నారని వైసీపీ నేతలు గుర్తించారు. ఇప్పటికైనా ఆయన తన వైఖరి మార్చుకొని ఆయన అపార అనుభవాన్ని ఏపీ అభివృద్ధికి కృషి చేస్తే రానున్న రోజుల్లో టీడీపీకి కొన్ని సీట్లైనా వస్తాయని లేనట్లయితే భవిష్యత్ లో పార్టీ పార్టీ ప్రశ్నార్థకంగా మారడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.