Begin typing your search above and press return to search.

టీడీపీకి..ఆయన అవసరం మళ్లీ ఏర్పడిందా?

By:  Tupaki Desk   |   18 Sep 2019 4:51 AM GMT
టీడీపీకి..ఆయన అవసరం మళ్లీ ఏర్పడిందా?
X
రాజకీయ పార్టీల్లో కొంతమంది వ్యక్తులకు ఒక్కోసారి అపారమైన ప్రాధాన్యత దక్కడం - ఆ తర్వాత వారు అనూహ్యంగా తెరమరుగు కావడం జరుగుతూ ఉండటం సహజమే. ఆ పార్టీల అధినేతలకు - ముఖ్య నాయకత్వానికి కొంతమంది వ్యక్తులు బాగా దగ్గరగా ఉండి వ్యవహారాలను నడిపించడం - అదే వ్యక్తులకే ఆ తర్వాత వారు దూరం కావడం జరుగుతూ ఉంటుంది.

అధినాయకత్వానికి బాగా దగ్గరగా వ్యవహరించే వారు ఆయా పార్టీల్లో పరిస్థితులను కూడా ప్రభావితం చేయగలరంటారు. ఆ పార్టీల గెలుపోటములను వారే నిర్దేశించకపోయినా.. కొందరు దగ్గరగా ఉండటం సదరు పార్టీలు మంచి ఫలితాలను పొందడం - కొందరు దూరం అయినప్పుడు ఆ పార్టీ నెగిటివ్ రిజల్ట్స్ పొందడటం జరుగుతూ ఉంటుంది. దీంతో వారు బాధ్యతల్లో ఉన్నప్పుడే బావుండేది అనే చర్చకు సహజంగానే అవకాశం ఉంటుంది.

ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనూ అలాంటి ఒక వ్యక్తి గురించి చర్చ జరుగుతోందట. ఆయనే లోకేష్ ఫ్రెండ్ అభీష్ట. చంద్రబాబునాయుడి తనయుడికి ఫ్రెండ్ గా ఆ పార్టీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించారీయన. అయితే ఇప్పుడు కాదు. తెలుగుదేశం పార్టీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈయన కీలకమైన వ్యవహారాలను సమీక్షించినట్టుగా తెలుస్తోంది. అప్పట్లో కొన్ని యాక్టివిటీస్ లో ఈయనది కీలక పాత్ర అని తెలుస్తోంది. అయితే తెలుగుదేశం పార్టీ అధికారం సాధించుకున్న తర్వాత ఈయనకు ప్రాధాన్యత తగ్గిపోయింది.

లోకేష్ కు సన్నిహితుడే అయినా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాకా ఈయనను అంతగా పట్టించుకోలేదని తెలుస్తోంది. అలాగని పూర్తిగా పక్కన పెట్టలేదట. కానీ ప్రాధాన్యతనూ ఇవ్వలేదు. దీంతో దూరం పెరిగింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం తెలిసిన సంగతే. అది కూడా చిత్తుగా ఓడింది టీడీపీ. ఇరవై మూడు సీట్లకే పరిమితం అయ్యింది. ఇలాంటి సమయంలో.. మళ్లీ పాత వాళ్ల ప్రస్తావన వస్తోందట ఆ పార్టీలో. అభీష్ట వంటి వాళ్లు మళ్లీ యాక్టివ్ రోల్ పోషించాలని - కొత్త స్ట్రాటజీలతో ముందుకు వెళ్లాలని.. చంద్రబాబు నాయుడు అలాంటి వారిని పిలిపించుకోవాలని - సలహాలు స్వీకరించాలని.. టీడీపీలోని కొంతమంది అంటున్నారట!