చంద్రబాబు మనవడు `దేవాన్ష్`కు అక్షరాభ్యాసం..

Sat Mar 06 2021 08:16:30 GMT+0530 (IST)

Chandrababu Naidu Grandson Aksharabhyasam Ceremony Performed At Basara temple

టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు మాజీ మంత్రి ఎమ్మెల్సీ లోకేష్ బ్రాహ్మణి దంపతుల ముద్దుల తన యుడు దేవాన్ష్ చదువులకు సిద్ధమైపోయాడు.  శుక్రవారం దేవాన్ష్‌తో అక్షరాభ్యాసం చేయించారు. నిజామాబాద్ జిల్లా గోదావరి తీరంలోని బాసరలో ఉన్న జ్ఞాన సరస్వతి ఆలయంలో చంద్రబాబు కుటుంబ సభ్యులు.. దేవాన్ష్ తో అక్షరాభ్యాసం చేయించారు. అయితే.. ప్రస్తుతం ఏపీలో మునిసిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు లోకేష్‌లు ఈ కార్యక్రమానికి హాజరు కాలేక పోయారు.కాగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఆయన కోడలు దేవాన్ష్ మాతృమూర్తి బ్రాహ్మణి అమ్మమ్మ వసుంధర(బాలయ్య సతీమణి) బాలయ్య మరో అల్లుడు ఎంవీ భరత్ ఆయన సతీమణి బాలయ్య రెండో కుమార్తె తేజస్విని ఇతర బంధువులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  బాబు కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు పండితులు ఘన స్వాగతం పలికారు. అనంతరం.. అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు.  కాగా దేవాన్ష్‌తో పాటు.. భరత్ తేజస్వినిల కుమారుడు ఆర్యన్‌కు కూడా ఒకే సారి అక్షరాభ్యాసం చేయించారు.  ఇక చంద్రబాబు బాలయ్య కుటుంబ సభ్యులు ఆలయానికి చేరుకోవడంతో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.